🌟 వినాయక చవితి భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటిగా ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధానమైన పండుగగా గుర్తించబడింది.
🌟 ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు, తనను పూజించిన భక్తుల పట్ల కృపతో, ఆయా కార్యాలు, కళలనందు విఘ్నాలు లేకుండా పూర్తిచేయడంలో సహాయపడుతాడని చెప్పబడింది. క్రమంగా విఘ్నాలకు నాయకునిగా విఘ్ననాయకుని పూజించడం జరుగుతుంది.
🌟 వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా ఉన్నాడు, క్రమంగా చేపట్టిన ఎటువంటి సమస్యయ అయినా విజయవంతం అయ్యేందుకు సహాయపడుతాడని చెప్పబడింది. ఏ పనిని ప్రారంభించినా, పూజ లేదా యజ్ఞయాగాదులకు తలపెట్టినా, ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరుగకుండా, తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని చెప్పబడింది.
🌟 వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని కొనుగోలుచేయదలచిన వారు, విగ్రహంలో వినాయకుని తొండం, ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి. విగ్రహం యొక్క రంగు వెర్మిలియన్ రంగులు లేదా తెల్లగా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు ఇంట్లో పూజించే విగ్రహం ఎట్టిపరిస్థితుల్లో మట్టి వినాయకుడిగా వుండాలి. ఎటువంటి రసాయనాల మిశ్రమాలను జోడించకుండా.
👉మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా....??
👉ఈ వినాయకుని చిత్రపటాన్ని గృహమున 🏡 సింహ ద్వారం వద్ద ఉంచిన సమస్త దృష్టి దోషాలు తోలుగుతాయి.
👉సామాన్యంగా వినాయకుడికి 2 కన్నులు ఉంటాయి. కాని ఈ వినాయకునికి 3 కన్నులు ఉండటం వలన ప్రత్యేక దృష్టి తో అన్ని దోషాలను హరిస్తారు.
👉వ్యాపార ప్రదేశమున ఈ వినాయకుడిని ఉంచి పూజించడం 🌺 వలన దృష్టి దోషాలు తొలిగి వ్యాపారం వృద్దిలోకి 💎 వస్తుంది.
🌟 శివపార్వతుల కుమారుడైన వినాయకుడు, సంవత్సరంలో ఒకరోజు అతిధిగా వచ్చి 10 రోజులు మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు, క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని చెప్పబడింది. ఈ పది రోజుల తర్వాత తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళ్ళిపోతాడు.
🌟 భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి నాడు ఉదయం ఐదింటికే నిద్ర లేవాలి. శుచిగా అభ్యంగనస్నానమాచరించి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి.. పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి.
🌟 ఆకుపచ్చ రంగు వస్త్రమును కప్పిన కలశమును, వినాయకుడి ఫోటో లేదా శ్వేతార్క గణపతి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. పసుపురంగు అక్షతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలలతో గణపతిని అలంకరించుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి.
🌟 దీపారాధనకు రెంచు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను ఉంచి, కొబ్బరినూనెతో దీపమెలిగించాలి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు పూజను పూర్తి చేయాలి.
🌟 విగ్రహాన్ని పూజకు ఉపయోగించిన పక్షంలో... మండపంపై విగ్రహం ఉంచి పవిత్ర జలంపై పాదాల్ని కడగాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో పంచామృత స్నానం చేయించాలి. ప్రతి అమృతానికి నడుమ నీటితో శుభ్రం చేస్తుండాలి. తర్వాత వినాయక ప్రతిమకు గంధం, అద్ది, ఎరుపులేదా, పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠం.
🌟 కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, ఋణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా "ఓం గం గణపతయే నమః" అనే మంత్రమును 108 సార్లు జపించాలి.తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి.