క్మసానస్థం భూతవేతాలసంగం నానాశ సైః ఖడ్గశూలాదిభిశ్చ
వ్యగ్రాత్యుగ్రా బాహవోలోకనాకే యస్య క్రోధోద్ధూతలో కోస్తమేతి.
యోభూతాదిః పంచభూతైః సిసృడు స్తన్మాత్రాత్మా కాలకర్మస్వభావైః
ప్రహృత్యేదం ప్రాప్యజీవత్వమీశో బ్రహ్మానందో రమతే తం నమామి.
🌺అర్ధం:
భూత, పిశాచములతో గూడి శ్మశానమందుండు వాడు, బహువిధస్త్రములు, ఖడ్గశూలాదులచే మిక్కిలి భయంకరములగు బాహువులు కలవాడు, ప్రళయకాలమున కోపాగ్నిచే సమస్తలోకమును భస్మముగావించువాడు
పంచమహాభూతములకు కారణభూతమగు అహంకారస్వరూపుడు (సత్వరజస్తమోగుణములు మూడు అహంకారములు, సాహంకారముచే పంచమహాభూత సృష్టి జరిగినని సాంఖ్యమతము. తామసమగు అహంకారా వచ్ఛిన్నచైతన్యమే మహాదేవుడని తాత్పర్యము. వేదాంతమతముననుసరించి సృష్టికారణము బ్రహ్మపదార్థము తన్మాత్రస్వరూపుడు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు తన్మాత్రలు) కాలకర్మస్వభావములచే జగత్తును సృజించు కోరిక గలవాడు, ప్రళయకాలమున సమస్తమునసహరించి బ్రహ్మానందము పొందువాడగు పరమేశ్వరుని నమస్కరించుచున్నాను.
🌹వాస్తు సంబందిత దోషాలను తొలగించడంలో ఈ సూర్యుని ప్రతిమ గృహములో ,వ్యాపార సంస్థ లో ఉంచుకోవడం ఉత్తమం.
🌹సూర్యుడు నవగ్రహాలకు అధిపతి అటువంటి సూర్య దేవుని స్తోత్రం ప్రతిరోజు పఠించడం వలన మేధస్సు, విశ్వాసం,ఆరోగ్యం, ధైర్యం, బలం, నాయకత్వ లక్షణాలు, కీర్తి, విజయం, శక్తి లభిస్తాయి.
స్థితాహష్ణు: సర్వజిష్ణుం సురాత్మా లోకాన్ ధన్ ధర్మసేతూన్ విభర్తీ
బ్రహ్మాద్యంశే యో..భిమానీ గుణాత్మా శబ్దాద్యంగైస్తం పరేశం నమామి.
యస్యాజ్ఞయా వాయవో వాంతి లోకే జ్వలత్యగ్నిః సవితా యాతి తప్యున్
శీతాంశు: భే తారకైః సగ్రహెళ్చ ప్రవర్తతే తం పరేశం ప్రపద్యే.
యస్యాశ్వాత్ సర్వధాత్రీ ధరిత్రీ దేవో వర్షత్యంబు కాలః ప్రమాతా
మేరుర్మధ్యే భవనానాఞ్చ భక్తా తమీశానం విశ్వరూపం నమామి
🌺అర్ధం:
లోకములను రక్షించుటయందు సర్వజయశీలుడగు విష్ణువై ధర్మసేతువులగు సాధువులను పాలించువాడు, శబ్దాద్యవయయములచే సగుణ స్వరూపుడవై బ్రహ్మాద్యంశములయందు అభిమానము కలిగిన పరమేశ్వరుడవగు నీకు నమస్కారము.
ఎవరి ఆజ్ఞచే వాయువు వీచునో, అగ్ని మండునో సూర్యుడు ప్రకాశించునో, చంద్రుడు నక్షత్రములతో గూడి ఆకాశమున సంచరించునో అట్టి పరమేశ్వరునికి నమస్కారము. ఎవరి ఆదేశముచే భూమిసమస్తమును వహించునో, మేఘుడు వర్షించునో, కాలము కొలబద్దయగునో, సుమేరు పర్వతము భూమండలమును వహించునో అట్టి విశ్వరూపుడగు పరమేశ్వరునికి నమస్కారము.
ఇతి కల్కిస్తవం క్రుత్వా శివః సర్మాత్మదర్శనః
సాక్షాత్ ప్రాహ హసన్నీశం పార్వతీసహితోగ్రతః
కల్కే! సంస్పృశ్యహస్తేన సమస్తావయవం ముదా
తమాహ వరయ ప్రేష్ఠ! వరం యత్తే. భికాంక్షితమ్
🌺అర్ధం:
కల్కి చేసిన స్తోత్రమును విని సర్వజ్ఞుడగు శివుడు పార్వతీ సహితుడై సాక్షాత్కరించి సంతుష్టుడై కల్కిని చేతితో స్పృశించి ఓ శ్రేష్ఠుడు నీకు అభిలషితమగు వరమును కోరుకొనుమని పలికెను.