*అశ్వత్థవృక్ష ( రావి చెట్టు ) ప్రదక్షిణ*
🌺శనివారమునాడు శ్రీ శనైశ్చర దేవతా పీడా పరిహారమునకై అశ్వత్థ ప్రదక్షిణము చెప్పబడినది.
🌺అశ్వత్థ వృక్షమును ఒక్క శనివారమునాడు మాత్రమే ముట్టుకోవచ్చును.
🌺అశ్వత్థ ప్రదక్షిణ, త్రిమూర్తుల సేవలలో ఒకటి.
🌺ఉదకశాంతి మంత్రములలో వచ్చు "నమో అస్తు సర్పేభ్యో యేకే చ పృథివీ మను " అను మంత్రము లోని "సర్పము" అను శబ్దమునకు సూర్య కిరణము అని కూడా అర్థమున్నది. ( ఈ మంత్రము రాహు గ్రహ ప్రత్యధిదేవత మూల మంత్రము కూడా ).
🌺అశ్వత్థ వృక్షము(రావి చెట్టు) ఆకులనుండీ ప్రసరించే సూర్య కిరణాలు గర్భవతుల పై పడినచో ఆ పుట్టబోయే వారికి కాల సర్ప దోషము కలగదు.
🌺వారి జాతకములో కాల సర్పదోషము ఉండదు. అందుకే గర్భవతులు రావి చెట్టు ప్రదక్షిణము చేయవలెనని అంటారు.
🌺ప్రదక్షిణ చేయునపుడు చెప్పవలసిన శ్లోకము
మూలతో బ్రహ్మ రూపాయ - మధ్యతో విష్ణు రూపిణే !
అగ్రతో రుద్రరూపాయ - వృక్షరాజాయ తే నమః !!
🌺పై శ్లోకము చెప్పుచూ యథాశక్తి 7 - 12 - 24 - 48 - 108 సార్లు ప్రదక్షిణలు చేసి అనంతరము కింది శ్లోకము చెప్పుచూ ప్రదక్షిణ సంఖ్యానుసారముగా అశ్వత్థ వృక్షమునకు నమస్కరించవలెను.
అశ్వత్థ హుతభుక్ వ్యాసో గోవిందస్య సదాశ్రయః !
అశేషం హర మే శోకం వృక్షరాజ నమోస్తుతే !!