*నాలుగు భుజములుగల బాలుడు రెండు భుజముల వాడిగా ఎలా మారెను ?* 🌺
*
తస్య విష్ణో రనంతస్య వసుధా ధాత్ పయః సుధామ్
మాతృకా మాంగల్యవచః కృష్ణజన్మదినే తథా.
బ్రహ్మాతదుపధార్మాకు స్వాకుగం ప్రొహ సేవకమ్
యాహీతి సూతికాగారం గత్వా విష్ణుం ప్రబోధయ.
చతుర్భుజమీదం రూపం దేవానామపి దుర్లభమ్
త్యక్త్వా మానుషవద్రూపం కురు నాథ! విచారితమ్.
🌺అర్ధం
విష్ణుమూర్తి కృష్ణావతార దినమున వలె విష్ణువు కల్కి అవతారమెత్తిన రోజున పృథ్వీ దుగ్ధరూపమగు సుధాధారను ధరించెను. మాతృక యను దేవి బాలున కాశీర్వాదముల నొసగెను, విష్ణువు చతుర్భుజములతో శంభల గ్రామమున జన్మించె నను విషయము తెలిసి బ్రహ్మ శీఘ్రగతి గల సేవకుడగు పవనుని నీవు సూతికా గృహమునుకు వెళ్ళి విష్ణుమూర్తిని ఓనాథ! చతుర్భుజరూపమును విడిచి మానుషరూపము ధరించవలసినదని ప్రబోధించుమని పలికెను.
ఇతి బ్రహ్మవచః శ్రుత్వా పవనః సురభిః సుఖమ్
సశీతః ప్రాహ తరసా బ్రహ్మణో వచనాదృతః
తచ్భుత్వా పుండరీకాక్షు తరనాద్ ద్విభులోని భవత్
తదా తశ్వితరౌ దృష్టా విస్మయా పన్నమానసా.
🌺అర్ధం
శీతలుడు, సుగంధయుక్తుడగు పవనుడు బ్రహ్మవచనమును విని శీఘ్రముగ వెడలి విష్ణుమూర్తికి నివేదించెను. పుండరీకాక్షుడు బ్రహ్మవచనాను సారము చతుర్భుజమూర్తి నుప సంహరించుకొని రెండు భుజములు కలవాడాయెను. నాలుగు భుజములుగల బాలుని రెండు భుజములు కలవానిగ మారుటను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులయిరి.
భ్రమ సంస్కారవ త్తత్ర మేనాతే తస్య మాయయా
తతస్తు శంభలగ్రామే సోత్సవా జీవజాతయః
మంగళా చారబహులా: పాపతాపవివర్జితాః
🌺అర్ధం
కాని వారు విష్ణుమూర్తి మాయచే మోహితులై భ్రమచే రెండు భుజములు గలవానిని నాలుగుభుజములు గల వానిగ తలచితిమనుకొనిరి. శంభల గ్రామమున ప్రజలందరుపాపతాపములను విడిచి మంగళాచరణ కలవారై ఉత్సవము జరుపుకొనిరి.
సుమతిస్తం సుతం లబ్వా విష్ణుం జిష్ణుం జగత్పతిమ్
పూర్ణకామా విప్రముఖ్యా నాహూ యాదా ద్దవాం శతమ్.
హరేః కళ్యాణకృ ద్విష్ణుయశాః శుద్ధేన చేతసా
సామర్థ్య జుర్విచ్చి రణ్యై స్తన్నామకరణే రతః
🌺అర్ధం
జగత్పతి జిష్ణువు నగు విష్ణుమూర్తిని పుత్రునిగ పొంది సుమతి బ్రాహ్మణోత్తములను ఆహ్వానించి నూరుగోవులను దానముగ నిచ్చెను. తండ్రియగు విష్ణుయశసుడు బాలుడగు హరికి శుభము కోరి ఋగ్వేద యజుర్వేద సామవేద విధులగు బ్రాహ్మణులను నామకరణమందునియోగించెను.
🌺పైన సారంశం ని బట్టి చూస్తే కల్కి పుట్టిన తర్వాత జరిగిన పరిమాణాలను వ్యాస మహర్షి ముందుగానే ఊహించి వ్రాసినట్లుంది.
🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.