మాముద్ధరంతి భువనే యజ్ఞాధ్యయన సత్రియాః
మాం ప్రసేవంతి శంసంతి తపోదాన క్రియాస్విహ.
స్మరంతా మోదయంత్యేవ నాన్యే దేవాదయస్తథా
బ్రాహ్మణా దేవవత్తారో వేదామే మూర్తయః పరాః
🌺అర్ధం:
యజ్ఞము, అధ్యయనము ఆచరించు బ్రాహ్మణులు నన్ను ఉద్దరించెదరు. తపస్సు, దానము మున్నగు కర్మలతో నన్ను సేవించుచు సురించెదరు. వేదములు ఉద్దరించెదరు. తపస్సు, దానము మున్నగు కర్మలతో నన్ను సేవించుచు స్మరించెదరు. వేదములు నా యొక్క ఉత్కృష్టములగు మూర్తులు. అట్టి వేదములను పలుకు బ్రాహ్మణులు నన్ను. కొలుచునట్లు.. ఆనందపరచునట్లు దేవాదులెవ్వరు చేయలేదు.
తస్మాదమే బ్రాహ్మణజార్జ్ : పుషాశ్రీ జగజ్జనాః
జగంతిమే శరీరాణి తత్పోషే బ్రహ్మణోవర
తేనాహం తాన్నమస్యామి శుద్ధసత్త్వగుణాశ్రయః
తతో జగన్మయం పూర్వం మాం సేవలేదిఖిలాశ్రయాః
🌺అర్ధం:
బ్రాహ్మణుల వలన ప్రచారము నొందిన వేదముల వలన ముల్లోకముల జనులు పరిపుష్టులగుచున్నారు. ముల్లోకములు నాశరీరము, శరీరపోషణకు ముఖ్యసాధనములు బ్రాహ్మణులు. కనుక శుద్ధ సత్వగుణము నాశ్రయించిన నేను బ్రాహ్మణులకు నమస్కరించుచున్నాను. నేను నమస్కరించినపిమ్మట శుద్ధాంతః కరణులగు బ్రాహ్మణులు నన్ను తెలుసుకొని సేవించెదరు
విశాఖయూప ఉవాచ.....
విప్రస్య లక్షణం బ్రూహి త్వద్భక్తిః కాచ తత్కృతా
యతస్తవానుగ్రహేణ వాగ్బాణా బ్రాహ్మణాః కృతాః
కల్కిరువా........
వేదా మామీశ్వరం ప్రాహురవ్యక్తం వ్యక్తిమత్పరమ్
తే వేదా బ్రాహ్మణముఖే నానాధర్మే ప్రకాశితాః
🌺అర్ధం:
విశాఖయూపుడు పలికెను... ఓదేవి తమ అనుగ్రహము వాక్కులే బాణములుగ కలవారిగ చేయబడిన బ్రాహ్మణుల లక్షణములను వివరింపుడు. మీయెడల వారికి గల భక్తి ఎటువంటిది.కల్కి పల్కెను. వేదములు నన్ను అ వ్యక్తుడు, పరాత్పరుడు, ఈశ్వరుడు అని స్తుతించుచున్నవి. నానా ధర్మప్రకాశకములకు అట్టి వేదములు బ్రాహ్మణ ముఖమునుండి వ్యక్తములైనవి.
యో ధర్మో బ్రాహ్మణానాం హి సా భక్తిర్యము పుష్కలా
తయాహం తోషితః శ్రీరః సంభవామి యుగే యుగే.
ఊర్ధ్వం తు త్రివృతం సూత్రం సదవానిర్మితం శనైః
తంతుత్రయమధోవృత్తం యజ్ఞసూత్రం విదుర్భుదాః
🌺అర్ధం:
బ్రాహ్మణులు యథావిధిగా తమ ధర్మములను ఆచరించుటయే నాయెడల భక్తిభావమని తెలిసికొనుము వారి ధర్మాచరణముచే సంతుష్టుడనై యుగయుగమున లక్ష్మీపతి అవతరించెదను.