రామ ఉవాచ......
బ్రహ్మణా ప్రార్థితో భూమన్ కలినిగ్రహకారణాత్
విష్ణుః సర్వాశ్రయం పూర్ణః సజాతః శంభలే భవాన్.
మత్తో విద్యాం శివాదస్త్రం లబ్వా వేదమయం శుకమ్
సింహలే చ ప్రియాం పద్మాం ధర్మాన్ సంస్థాపయిష్యసి.
🌺అర్ధం:
పరశురాముడు పలికెను. కలిసంహారము కొఱకు బ్రహ్మదేవుని ప్రార్థనచే మీరు కల్కి రూపమున శంభలగ్రామమున జన్మించిరి. మీరు మా నుండి విద్యను, శివుని వలన అస్త్రములను, వేద విద్యను పొంది, సింహలదేశమునుండి పద్మును భార్యగపొందిధర్మ సంస్థాపన చేయగలరు.
తతో దిగ్విజయే భూపాన్ ధర్మహీనాన్ కలిప్రియాన్
నిగృహ్య బౌద్ధాన్ దేవాపిం మరుఖ్చ స్థాపయిష్యసి.
వయమేతైస్తు సంతుష్టాః సాధుకృత్యైః సదక్షిణాః
యజ్ఞం దానం తపః కర్మ కరిష్యామో యథోచితమ్
🌺అర్ధం:
అనంతరము మీరు దిగ్విజయ యాత్ర చేసి కలిప్రియులు ధర్మహీనులగు రాజులను, బౌద్ధులను నాశముజేసి మరు దేవాపులను రాజ్యమందు నియమించగలరు. ఈ సాధుకార్యము చే మేము సంతుష్టుల మగుదుము. ఇదియే మాకు దక్షిణ. దీని వలన యజ్ఞము, దానము, తపము మున్నగు కర్మలను యధోచితముగ చేయగలము.అని పలికెను
ఇత్యేత ద్వచనం శ్రుత్వా నమస్కృత్య మునిం గురుమ్
బిల్వోదకేశ్వరం దేదం గత్వా తుష్టాన శంకరమ్.
పూజయిత్వా యథాన్యాయం శివం శాంతం మహేశ్వరమ్
ప్రణిపత్యారుతోషం తం ధ్యాత్వా ప్రాహ హృది స్థితమ్.
🌺అర్ధం:
పరశురాముని మాటలు వినిన కల్కి గురువులకు నమస్కరించి బిల్వోరకేశ్వరుడగు శంకరుని జేరి స్తోత్రము జేసి యథోచితముగ పూజించి నమస్కరించెను. అల్పసంతోషియు హృదయస్థుడునగు శివుని ధ్యానించి కల్కి పలికెను.
కల్కిరువాచ....
గౌరీనాథం విశ్వనాథం శరణ్యం భూతావాసం వాసుకీకంఠభూషమ్
క్షం పంచాసాదిదేవం పురాణం వందే సాంద్రానందసందోహదక్షమ్.
యోగాధీశం కామనాశం కరాలం గంగాసంగా క్లిన్న మూర్ధానమీళమ్
జటాజూటాటో పరిక్షిప్తభావం మహాకాలం చంద్రభాలం నమామి.
🌺అర్ధం:
కల్కి ఇట్లు స్తుతించెను. గౌరీనాథుడు, విశ్వనాథుడు, రక్షణ సమర్థుడు, సమస్త ప్రాణుల హృదయములందున్న వాడు, వాసుకి కంఠాభరణముగ గలవాడు, త్రిలోచనుడు, పంచవదనుడు, ఆదిదేవుడు, పురాతనుడు, అమితానంద సందోహదక్షుడగు పరమేశ్వరుని నమస్కరించుచున్నాను. ధ్యానమున కధిపతి, కామ్యకర్మలను నాశముచేయువాడు, భయంకరుడు, గంగచేతడిసిన శిరస్సుగలవాడు, ఆహ్లాదముకలుగజేయులలాటము కలవాడు అగు మహా కాలుని నమస్కరించుచున్నాను.