కల్కి పురాణం - మూడవ అధ్యయనం -మొదటి భాగం

P Madhav Kumar


సూత ఉవాచ......


తతో వస్తుం గురుకులే యాంతం కల్కిం నిరీక్ష్య సః

మహేంద్రాద్రిగ్ధతో రామః సవనీయాశ్రమం ప్రభుః


ప్రాహ త్వాం పాఠయిష్యామి గురుం మాం విద్ధి ధర్మతః

భృగువంశసముత్పన్నం జామదగ్న్యం మహాప్రభుమ్.


వేదవేదాంగతత్త్వజ్ఞం ధనుర్వేద విశారదమ్ 

కృత్వా నిఃక్షత్రియాం పృథ్వీం దత్వా విప్రాయ దక్షిణామ్.


మహేంద్రాద్రౌ తప స్తప్తు మాగతోహం ద్విజాత్మజ

త్వం పఠాత్ర నిజం వేదం యచ్చాన్య చ్ఛాత్రముత్తమమ్


🌺అర్ధం: 

సూతుడు పలికెను, మహేంద్రపర్వతమందు నివసించు పరశురాముడు విద్యాభ్యాసము కొఱకు గురుకులమునకు వెళ్ళుచున్న కల్కిని చూచి, అతనిని తన ఆశ్రమమునకు తీసుకువచ్చి నేను నీకు అధ్యాపనము చేయుదును. నన్ను నీవు గురువుగ తెలిసికొనుము.

భృగువంశమందు పుట్టిన జమదగ్ని పుత్రుడను నేను. వేదవేదాంగతత్త్వమును తెలిసినవాడను. ధనుర్విద్వావిశారదుడను. ఓ బ్రాహ్మణ కుమార! నేను భూమినంతటిని క్షత్రియరహితముగ చేసి బ్రాహ్మణులకు దక్షిణగనిచ్చి తపస్సు నాచరించుటకు మహేంద్రపర్వతమునకు వచ్చితిని. నీవు ఇచ్చట వేదశాస్త్రముల నధ్యయనము జేయుము అని చెప్పెను.


ఇతి తద్వచ ఆశ్రుత్య సంప్రహృష్టతనూరుహః

కల్కిః పురో నమస్కృత్య వేదాధీతీ తతో భవత్.


సాంగం చతుష్షష్టికలం ధనుర్వేదాదికం చ యత్ 

సమధీత్య జామదగగ్న్యాత్ కల్కిః ప్రాహ కృతాంజలిః


🌺అర్ధం: 

పరశురాముని వచనములు విని హర్షులకితుడయిన కల్కి గురువులకు నమస్కరించి.. వేదాధ్యయనము జేసెను. జామదగ్ని నుండి 64 కళలు ధనుర్వేదాది విద్యలను నేర్చుకొని,కల్కి చేతులు జోడించి యిట్లు పలికెను.


శుక్ర నీతిలో 64 కళల వివరణము కలదు. ఆయుర్వేదము ధనుర్వేదము, గంధర్వవేదము, అర్థశాస్త్రమని ఉపవేదములు నాలుగు


దక్షిణాం ప్రార్ధయ విభో! యా చేయా తవ సన్నిధౌ 

యయామే సర్వసిద్ధిః స్యా ద్యా స్యాత్ త్వత్తోషకారిణీ.


🌺అర్ధం: 

గురుదేవా! మీకు తప్పక ఈయ దగినదియు, నాకు సర్వము సిద్ధింపజేయునదియు,మీసంతోషమునకు కారణభూతమునగు దక్షిణను కోరుడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat