*🌹శ్రీ నెమలి వేణుగోపాలస్వామి🙏*

P Madhav Kumar

స్వయంభుగా వెలసిన శ్రీ నెమలి వేణుగోపాలస్వామివారు


భూగర్భమునుండి సాక్షాత్కరించిన కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు... శ్రీ కృష్ణుడికి... నెమలికి విడదీయరాని సంబంధముంది. నెమలి పింఛం ధరించడమంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. చేతిలో వెన్న ముద్దలేని బాల కృష్ణుడు కనిపిస్తాడేమో గానీ, తలపై నెమలి పింఛంలేని కృష్ణుడు మాత్రం కనిపించడు. ఈ సృష్టిలో సంయోగం చేత సంతానాన్ని పొందని పక్షి నెమలి మాత్రమే. ఈ పవిత్రతే శ్రీ కృష్ణుడు నెమలి పింఛం ధరించడానికి కారణమైందని చెబుతుంటారు. అలాంటిది నెమలి అనే ఊళ్లో శ్రీ కృష్ణుడు ఆవిర్భవించడమనేది సహజంగానే విశిష్టతను సంతరించుకున్నదిగా అనిపిస్తుంది.


ద్వాపరయుగంలో రాక్షస సంహారానికి, రాక్షసత్వం భరతం పట్టడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. దశావతారాల్లో కృష్ణావతారం బహుళ ప్రచారమైంది. అటు శృంగారంతో పాటు అఖండ చతురతతో రాజనీతి యోగనిష్టగా భారత యుద్ధంలో పాల్గొన్న అవతారమూర్తి గీతాగోవిందుడు.”


స్వయంభువుగా వేణుగోపాలస్వామి నెమలిలో వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక, వేణువుతో స్వామి నిలుచున్న భంగిమలో విగ్రహంతో పాటు గోదాదేవి, ఆళ్వారు స్వామి లభ్యమయినది. 


కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శీల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు.


స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిస్థదలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులతో పూజలు నిర్వహించారు.


నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆద్వర్యంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు.


గోపాలుని దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat