*ఆ బాలుడికి కల్కి అనే పేరు ఎలా వచ్చింది* 🌷
తదా రామః కృపోవ్యాసో ద్రోణి ర్భితుశరీరిణః
సమాయాతా హరం ద్రష్టుం బాలకత్వ ముసాగతమ్.
తా నాగతాన్ సమాలోక్య చతురః సూర్యసన్నిభాన్
హృష్టరోమా ద్విజవరః పూజయాజ్చక్ర ఈశ్వరాన్.
🌺అర్ధం
అప్పుడు పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వ్యాసుడు భీతు రూపమును ధరించి బాలుడు ని చూచుటకు వచ్చిరి. బ్రాహ్మణోత్తముడగు విష్ణుయశనుడు సూర్యుని వలె ప్రకాశించెడి వెలుగుని చూచి హర్షపులకితుడై పూజించెను
పూజితా స్తే స్వాసనేషు సంవిష్టాః స్వసుభాశ్రయాః
హరం క్రోడగతం తస్య దద్భకు: సర్వమూర్తయ.
తం బాలం నరాకారం విష్ణుం నత్వా మునీశ్వరాః
కల్కిం కల్కవినాకార మావిర్భూతం ఐదు ర్భధాః
🌺అర్ధం
మహర్షులు యధోచితముగ పూజింపబడినవారై తృప్తిని పొంది ఆసనములయం దుపవిష్ణులై తండ్రి ఒడిలోనున్న బాలుడగు హరిని చూచిరి. మునీశ్వరులు మనుష్యరూపమును ధరించిన హరికి నమస్కరించిరి. అతను భూకలంక వినాశనము కాటుకు ఆవిర్భవించిన కల్కి అవతారముగ వారు తెలిసికొనిరి.
నామాకుర్వం స్తత స్తస్య కల్కిరిత్యభివిశ్రుతమ్
కృత్వా సంస్కారకర్మాణి యయుస్తే హృష్టమానసా
తతః స నవ్యధే తత్ర సుమత్యా పరిపాలితః
కాలే నాల్పేన కంసారిః శుక్లపడే యథా శశీ.
🌺అర్ధం
మహర్షులు ఆబాలునికి కలమును ( పాపమును) పోగొట్టువాడగుటచే కల్కియని ప్రసిద్ధమగు నామకరణము చేసిరి. పిమ్మట జాతకర్మలను పూర్తి చేసి సంతుష్టమనస్కులై అక్కడినుండి వెడలిరి, జాతసంస్కారములు పూర్తియయిన బాలుడు సుమతినే పోషింపబడును అల్పకాలముననే శుక్లపక్ష చంద్రుని వలె వృద్దిపొందెను.
కల్కే: జ్యేష్తాత్రేయః కూరాః కవి ప్రాజ్ఞ సుమంత్రకాః
పితృమాతృప్రియకరా గురువిప్రప్రతిష్ఠితాః
కల్కే రంకాః పురా జాతాః సౌధవో ధర్మతత్పరాః
గార భార్య విశాలాద్యా జాతయ స్తదను వ్రతాః
🌺అర్ధం
తల్లిదండ్రులకు ప్రియమును కల్గించువారు, కల్కికి జ్యోష్ణసోదరులు, సజ్జమలు, ధర్మతత్పరులు, విష్ణుమూర్తి యొక్కఅంతలగు గార్లు భాగ్య విశాలాదులు కల్కి ననుసరించు వారై కల్కి వంశమున జ్ఞాతులుగ జన్మించిరి.