త్వయా కృత మిదం స్తోత్రం యే పఠంతి జనా భువి
తేషాం సర్వార్థసిద్ధిః స్యాదిహలోకే పరత్రచ.
విద్యార్థీ చాప్నుయాద్విద్యాం ధర్మార్దీ ధర్మ మాప్నుయాత్
కామా నవాప్నుయాత్ కామీ పఠనాచ్ఛవణాదపి.
🌺అర్ధం:
నీవు చేసిన శివస్తోత్రమును లోకమున పఠించుజనులు సర్వార్ధములను ఇహపరలోకములలో పొందగలరు. ఇది చదివిన లేక విన్న విద్యార్థి విద్యను, కామార్థి కోరికలను ధర్మార్థి ధర్మమును పొందగలడు.
త్వం గారుడ మిదం చాశ్వం కామగం బహురూపిణమ్
శుక మేన సర్వజ్ఞం మయాదత్తం గృహాణ భో
సర్వశ స్తోత్ర విద్యాసం సర్వవేదార్ధపారగమ్
జయినం సర్వభూతానాం త్వాం వధిష్యంతి మానవాః
రత్నత్సరుం కరాల్చ కరవాలం మహా ప్రథమ్
గృహాణ గురుభారాయాః పృథివ్యా భారసాధనమ్.
🌺అర్ధం:
ఓ కల్కి! నీకు సమస్తకోరికలు తీర్చునది. బహురూపములు గలదియగు గరుడమును ( గరుత్మంతుని వలన బుట్టినది) అశ్వము, సర్వజ్ఞడగు చిలుకను ఇచ్చెదను. గ్రహింపుము. జనులు నిన్ను సర్వశాస్త్రవిద్వాంసునిగ, సర్వవేదార్థపారంగతునిగ జయశీలునిగా ప్రశంసించెదరు. రత్న మయమైన , తేజోమయమయిన ఖడ్గమును గ్రహింపుము. ఇదిమిక్కిలి భారము అనుభవిస్తూ భూమియొక్క భారమును పోగొట్ట గలదు.
🌷దీపం పరబ్రహ్మ స్వరూపం . నిత్యం ఇంట్లో దీపారాధన చెయ్యడం వలన అనేక రకాలయిన సమస్యలను తొలగించవచ్చు.
ఇతి తద్వచ ఆశ్రుత్య నమస్కృత్య మహేశ్వరమ్
శంభలగ్రామమగత్ తురగేణ త్వరాన్వితః
పితరం మాతరం భ్రాతౄన్ నమస్కృత్య యథావిధి
సర్వం తద్వర్ణయామాస జామదగ్న్యస్య భాషితమ్.
🌺అర్ధం:
పరమేశ్వరుని వచనములను విని కల్కి వారికి నమస్కరించి గుఱ్ఱముమీద శీఘ్రముగ శంభల గ్రామము చేరెను. తల్లిదండ్రులకు సోదరులకు నమస్కరించి పరశురాముని వద్ద అధ్యయనము చేసినది వివరించి చెప్పెను.
శివస్య వరదాన కథయిత్వా శుభాః కథాః
కల్కి : పరమతేజస్వీ జ్ఞాతిభ్యో ప్యవదన్ ముదా.
గార్యభార్యవిశాలాద్యాః తచ్చుత్వా నందితాః స్థితాః
కఠోపకథనం జాతం శంభల గ్రామవాసినామ్.
🌺అర్ధం:
శివుడు వరమిచ్చిన శుభవృత్తాంతమును తల్లిదండ్రులతో బాటు తన బంధువులకు కూడ పరమతేజస్వీయగు కల్కి చెప్పెను. కార్య భార్య విశాలాదులు ఈ వృత్తాంతమును విని మిక్కిలి సంతోషించిరి. శంభలగ్రామవాసులు దీనిని కథలు కథలుగ చెప్పుకొనసాగిరి.