గరుడ పురాణము - పదకొండవ అధ్యయనం -సూర్యార్చన -రెండవ భాగం🌸

P Madhav Kumar


పదకొండవ అధ్యయనం -సూర్యార్చన -రెండవ భాగం


ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః 

ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః 


ఓం బుధాయ సోమ సుతాయ నమః 

ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః 


ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః

ఓం శనైశ్చరాయ సూర్యాత్మ జాయ నమః 

ఓం రాహవే నమః 


🌺అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ధ్యాది ప్రదానానికైఆవాహన చేయాలి.


ఓం అనూరుకాయ నమః 

ఓం ప్రమథనాథాయ నమః 

ఓం బుధాయ నమః 


🌺ఓం భగవన్నపరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగలతత్ ఏహ్యేహి ఇదమర్ధ్యం మమ శిరసిగతం గృష్ణా గృష్ణా గృష్ణా తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల రఠ నమః


*ఆవాహన తరువాత

ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్ఛసుఖం పునరాగమనాయ

అనే మంత్రాలతో విసర్జనం చేయాలి .


🌺హరి ఇంకా ఇలా చెప్పాడు. రుద్ర దేవా ! సూర్య పూజ విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను.సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళకమలాన్ని నిర్మించాలి.


🌺 అప్పుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో భగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి.ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైన హృదయాన్ని స్థాపించాలి.ఈశాన్యంలో శిరస్సునీ, వైరృత్యంలో శిఖనీ విద్యాసం చెయ్యాలి (అంటే పెట్టాలి). మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్నీ, వాయవ్యంలో నేత్రాలనూ, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలను వుంచాలి.


🌺మరణ ఈశాన్యంలో చంద్రునీ, తూర్పున మంగళునీ, ఆగ్నేయంలో బుధుని, దక్షిణ దిశలో బృహస్పతినీ, నైరృతిలో శుక్రునీ, పడమటి దిశలో శనిని, వాయువ్యం లో కేతువునీ ఉత్తర దిక్కులో రాహువునీ స్థాపించి పూజించాలి.


🌺ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాతా, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు అను సూర్యుని పన్నెండు రూపాలనూ రెండవ వరుసలో పెట్టి పూజించాలి.తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్పించి, జయా, విజయా, జయంతి, అపరాజిత అను శక్తులనూ వాసుకి, శేషాది నాగులనూ కూడా పూజించాలి. ఇది సూర్య పూజావిధానం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat