పదకొండవ అధ్యయనం -సూర్యార్చన -మొదటి భాగం
🌺శంఖ చక్రగదాధారీ! భగవాన్ శ్రీహరీ! మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధ రూపుడు, పరమాత్మయగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానందభరితులమైనాము. విష్ణు ధ్యానవర్ణనను విని ధన్యులము కాగోరుచున్నాము అన్నాడు కాలకంఠుడు.
🌺శ్రీ హరి పరమేశ్వరుని తో ఇలా అన్నాడు !జ్ఞానరూపుడు, అనంతుడు సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునగు హరియే సర్వ దుఃఖాలనూ హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ. సంపూర్ణ సంసారానికి మూలకారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం ఆయనే అయినా, స్వయంగా నిరాధారుడు.
🌺పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు. ముక్తయోగులకు ధ్యేయమైనవాడు. మీరడిగిన ధ్యాన వర్ణనను సూర్యపూజతో మొదలుపెడతాను. ఒకప్పుడిది భృగుమహర్షికి బోధింపబడింది.ఓం ఖఖోల్కాయ నమః ఇది సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్నీ మోక్షాన్నీ ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి.
ఓం ఖఖోల్యాయ త్రిదశాయ నమః
ఓం విచిఠత శిరసే నమః
ఓం జ్ఞానినేతఠ శిఖాయై నమః
ఓం సహస్రరశ్మయేఠత కవచాయ నమః
ఓం సర్వతేజోధి పతయే తత అస్త్రాయ నమః
ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఈర నమః
🌺సాధకుని యొక్క సర్వపాపాలనూ నశింపజేసే ఈ సూర్యమంత్రాలను అగ్నిప్రాకార మంత్రాలని కూడా అంటారు.సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి.
ఓం ఆదిత్యాయ విద్మహే
విశ్వభావాయ ధీమహి
తన్నః సూర్యః ప్రచోదయాత్
🌺తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులనూహించుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి.
ఓం ధర్మాత్మనే నమః తూర్పు
ఓం యమాయ నమః దక్షిణం
ఓం దండనాయకాయ నమః పశ్చిమం
ఓం దైవతాయ నమః ఉత్తరం
ఓం శ్యామపింగలాయ నమః ఈశాన్యం
ఓం దీక్షితాయ నమః అగ్ని కోణం
ఓం వజ్రపాణయే నమః నైరృత్యం
ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం
🌺మహేశా! ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ నమస్కారసహితంగా పూజించాలి.