_విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని ఎందుకు పిలుస్తారు ...??

P Madhav Kumar


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు , బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగురోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం కూడా ఉంది. 


🌿వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతారా !అనిఅడిగాడట. 


🌸మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా !’అన్నాడట గణపతి. ‘సరే ! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే  నేనూ వేగంగా చెబుతా ! అన్నాడట వ్యాసుడు. 


🌿సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది ! వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతికఠినమైనవి చెబుతుండేవాడట. 


🌸వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది ! 


🌿తన షరతు ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలి పోయిందని శోకించాడట వ్యాసుడు. 


🌸సరే  తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది ? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే  ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు.


🌿 లేదా  వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానేవూహించాడు ! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టిన రోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. 


🌸సకల విద్యలు అబ్బుతాయి అని ఆశీర్వదించాడట. అందుకే విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని కూడా పిలుస్తారు...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat