బ్రహ్మ నుదుటిన రాత..!*

P Madhav Kumar


*🪷 మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కాదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది.*


*🪷 అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను.*


*🪷 మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాసారంట. అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు.*


*🪷 ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది.*


*🪷 ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.*


*🪷 పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు, ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ.*


*🪷 అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు.*


*🪷 జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే… అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…*


*🪷 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.*


*🪷 కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది అని చెబుతారు.*


*🪷 ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది.*


*🪷 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు.*


*🪷 కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.*


*🪷అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చెయ్యండి...*

*స్వస్తి...🙏🌹🎻*         


*🙏🪷 హరే కృష్ణ గోవిందా  🪷🙏*

🌷🌷🌷 🌟🕉️🌟 🌷🌷🌷

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat