శ్రీ కృష్ణ జన్మ సందర్భంలో ముందుకు వచ్చిన ‘యోగమాయ'కు పురాణపరంగా ఆ తర్వాత ప్రాధాన్యం ఉన్నదా?*

P Madhav Kumar


*జ* : యోగమాయ శ్రీకృష్ణుని కంసకారాగారం నుండి నందవ్రజానికి చేర్చడానికై అవతరించిన మూర్తి. తన శిశురూపాన్ని వదలి, లీలామయమైన అష్టభుజ స్వరూపాన్ని ప్రకటించి అంతర్ధానమయ్యింది. భాగవతం ఇంతవరకు చెబుతోంది.

కానీ ఆ స్వరూపం వింధ్య పర్వతంలో నెలకొని, దేవతలచే ఋషులచే పూజలందుకుంటూ - క్రమంగా శుంభ నిశుంభులనే రాక్షసుల్ని సంహరించి జగతిని కాపాడిందని 'దేవీమాహాత్మ్యం' (మార్కండేయపురాణం) చెబుతోంది. ఈ శక్తి పేర్లు నందాదేవి, వింధ్యవాసిని.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat