🔱 *కుమారచరిత్ర* -11🔱

P Madhav Kumar


🙏

శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*  

 

అప్పటికి అగ్ని శక్తి క్షీణించసాగింది. ఆ తేజస్సును అగ్నికూడ భరించలేక ఉన్నాడు.

 

వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్ని దేవుని ఆహ్వానించారు.


 అగ్నిదేవుడు సర్వాలంకార భూషితలై భర్తల ప్రక్కన సప్త ఋషి పత్నులను చూసి  మోహించాడు. వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడ్డాడు. 

 హోమం ముగిసింది 

 అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసికట్టింది. 

స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్న రెల్లు కుండలో దాచింది. ఇలా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరచింది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించ లేక పోయింది. 

 

(శివతేజస్సు సప్తర్షులలో ఒక్క అరుంధతీ సహిత వశిష్ఠునికి తప్ప ఇతర ఋషుల భార్యలను కూడా కష్టాలపాలు చేసిందని పురాణగాథ)

 

ఈ విధంగా 6 కుండలలో భద్రపరిచిన శివతేజస్సును గంగ నది దేవతలా ప్రార్థనపై గ్రహిస్తుంది 

 శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగా భరించలేక కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమీ చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిడేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద రెల్లు పొదల్లోకి చేర్చింది వదిలింది.  

  

అలా మార్గశిర శుద్ధ షష్ఠినాడు - కుమారస్వామి ఆవిర్భావానికి సహకరించింది గంగమ్మ తల్లి. 

తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి.  

 

అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకములో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు  

శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. 

 

ఆ విధంగా ఆరు మార్లు కూర్చిన అగ్ని తేజస్సుతో కుమారస్వామి ఆరు ముఖాలతో అగ్ని తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మించాడు. 

 

శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు.

 

 ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు.  

అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు  ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు.  

ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు.  

కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు.


 సనత్కుమారుడు ఇలా జన్మించాడుకాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. 

  

ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది.

 

పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. 

 

అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

 

ఈ ఆరు కృత్తికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు. 


 

ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు.


ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు.

కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. 

  

ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది.


 కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు


 శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్య

 కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్* |* 

 భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,

 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 8 ‖


  🔱   *ఓం శరవణ భవ* 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🙏 *జై శ్రీమన్నారాయణ*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat