🔱 *కుమారచరిత్ర* -15&16🔱

P Madhav Kumar


🙏శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః

 


తారకాసుర సంహారానంతరం ఒక రోజు శ్రీ మహా విష్ణువు బ్రహ్మాది దేవతలతో పరివేష్టుడై ఉండగా కుమార స్వామి ఆ సభ లోకిప్రవేశించాడు .


 ఆయన అందానికి దేవతలందరు నిశెచేష్టులైనారు .  

మహా విష్ణువు సైతం నోట మాటరాక తదేక దృష్టి తో స్కందుని వీక్షించగా ఆనందంతో ఆయన కళ్ళ నుండి రెండు భాష్పాలూ నేలకొరిగి అవి అతిలోక సుందరీమణులుగా మారాయి . 

 

విష్ణుమూర్తి వారికి అమృతవల్లి , సుందరవల్లి అని నామకరణం చేసాడు . వారు సైతం స్కందుని అందానికి చకితులై విష్ణువును తండ్రి ఆ దివ్య పురుషుడిని మాకు భర్తగా ఒసగ మని ప్రార్ధించగా ఆయన మందహాసముతో పుత్రికలారా స్కందుడు వుద్భవించిన శరవణ తటాకము పక్కన ఆయన కొరకై తపించండి మీ కోర్కెలు ఈడేరగలవు అని సెలవీయగా వారు ఆయన సూచన ప్రకారము తపస్సు ప్రారంభించారు .


 వారి తపస్సుకు మెచ్చి కుమారస్వామి ప్రత్యక్షమై బాలమణులారా మీ కోరిక సమంజసమైనదైనా దానినివెంటనే తీర్చలేను అంటూ 

 అమృతవల్లి వైపు తిరిగి నీవు దేవేంద్రుడి కుమార్తెగా వున్న కాలంలో నిన్ను చేపట్టగలను అని చెప్పి 

 సుందరవల్లి తో నీవు భూలోకంలో శివముని కుమార్తె గా వున్నప్పుడు నిన్ను వరిస్తాను అని అనుగ్రహించి అక్కడినుండి అదృశ్యమయ్యాడు. 

  

ఆ వరానుసారముగా మరుజన్మలో అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తెగా దేవసేన జన్మించింది.  

ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది.  

ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు.  

ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి  ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళటానికి సన్నద్ధమై   నీకేం వరం కావాలో కోరుకో ” అని ఇంద్రుడు దేవసేనని అడిగాడు. 

 

ఆమె ” దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి.  

దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే  

వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు ” అని కోరింది.

 

ఆమె మాటలు విని దేవేంద్రుడు ” ఈ రోజు అమావాస్య సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం రౌద్ర ముహూర్తం. అగ్ని    మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు.  

కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు ” అని అనుకొన్నాడు.


దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు.


బ్రహ్మదేవుడు ” దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాదిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు ” అన్నాడు.

 

ఆ మాటలను ఆలకించిన దేవసేన ఆనందంతో ఆ మహాపురుషునికై నిరీక్షించసాగిందితన సమస్యలన్నీ తొందరలో తొలగిపోనున్నాయని ఆనందముతో ఐరవాతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఆమెను తన ఐరావతం పైకి ఎక్కించాడు .

 

అప్పటినుండి ఆమెను దేవ యాని గా పిలిచారు . 

 

కుమార్తె భద్రగజం ఫై వస్తున్నప్పుడు దేవ సైన్యము ఆ గజము వెనక వస్తున్న విషయం గ్రహించి ఆమెను దేవసేన గా కీర్తించారు . 

 

పిమ్మట ఆమె మేరుపర్వతానికి తపస్సు చేయటానికి మరలినది . 


ఇంకా దేవసేనను షష్టి దేవి గా కొలుస్తారు . ఈ విషయం  

దేవి భాగవతం లో స్పష్టంగా చెప్పబడినది .ఈవిడ సంతానానికి అధిష్టాన దేవత . 


ఆదిశేషుని అంశ తో సుందరవల్లి శివముని అనే మహర్షి కి అయోనిజయై ప్రభవించగా ఆయన ఆ శిశువును సాకమని బిల్లు దొర నంబిరాజుకు అప్పగించగా అతను ఎంతో సంతోషంతో ఆమెను పెంచసాగాడు .

 

వల్లి నామధేయముతో ఆ కన్య సదా కార్తికేయ స్మరణతో ఆయన కోసం ఎదురు చూడ సాగింది

 

కార్తికేయుడు వీరివురికి సూర పద్ముడు , సింహముఖుల సంహారానంతరం వివాహం చేసుకొనగలనని వరమిచ్చారు గావున ఆ ఘడియ కోసం వారి నిరీక్షణ కొనసాగింది..


మయూరాధి రూఢం మహా వాక్య గూఢం

మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం |

మహీ దేవ దేవం మహా వేద భావం

మహాదేవ బాలం భజే లోకపాలం !!


  🔱   *ఓం శరవణ భవ* 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏



🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸


🙏 ఓం శ్రీ శరవణ భవ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat