🔱 కుమారచరిత్ర -14 🔱

P Madhav Kumar

 


శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః  


అప్పుడు స్కందుడు బ్రహ్మాది దేవతలను కూడి పరిస్థితిని సమీక్షించగా బ్రహ్మ ఈ విధంగా పలికాడు . ..కుమారా తారక సంహరణార్ధమై ప్రభవించిన శూరుడివి నీవు . నీ చేతులలోనే అతని మరణము తధ్యము కానీ అతని కంఠ సీమలో పరమశివుని ఆత్మ లింగం వున్నత వరకు ఆతను అభేధ్యుడు కావున ముందర ఆ ఆత్మలింగ ఛేదన జరగాలి అని తరుణోపాయం చెప్పాడు .

 

అనంతరం నారదుడు కుమార నీ వద్ద వున్నా ఆత్మీయాస్త్రంతో దానిని ఛేదించు కానీ ఆ శకలాలు భూ పతనం కాక ముందే వాటికీ ఆలయ నిర్మాణాలు జరగాలి అని సూచన ఇచ్చాడు అంతేకాక ఎప్పుడైతే ఆత్మ లింగం ఛేదనమవుతుందో అప్పుడు తారకుడు బలహీనుడవుతాడు . 

 ఆ సమయంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం జరగాలి అని తారక మరణ రహస్యాన్ని తెలియచేసాడు

 

వీరందరి వచనాలను శ్రద్ధతో ఆలకించిన శరవణ భవుడు  యోచించి విశ్వకర్మను పిలిచి ఆత్మలింగ శ కలాలను 

 నేను, ఆదిత్యుడు , సోముడు ఇంద్రుడు ,మహావిష్ణువు   భూపతనం కాకుండ అడ్డుకుంటాము . నీవు వెనువెంటనే ఆలయాలు నిర్మిచాలి అని ఆజ్ఞాపించాడు.

 

ఆ తర్వాతి రోజు జరిగిన భీకర సమరంలో స్కందుడు ఆత్మీయ ఆగ్నేయ అస్త్రాలను సంధించి ఆత్మలింగాన్ని ఛేదించాడు . 

ఆ సమయంలో వెలువడిన ఓంకారం విశ్వమంతా వ్యాపించింది . 

 

ఇంద్రుడు ,సూర్యుడు, కుమారుడు , చంద్రుడు మరియు విష్ణువు ఆ శకలాలకు విశ్వకర్మ సాయంతో వెనువెంటనే ఆలయాలు నిర్మించారు . అవి వరుసగా అమరారామం , ద్రాక్షారామం  కొమరారామం సోమారామం మరియు క్షీరారామం 

 పేర్లతో పంచారామాలుగా ఖ్యాతిని పొందాయి

 

పిదప అదును చూసి కుమారస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం చేయగా ఆ భక్తాగ్రేసరుడు నేలకూలాడు . రాక్షస సైన్యం పలాయనం చిత్తగించారు. దేవతలందరు ఆనందంతో స్కందునిపై పుష్పవృష్టి కురిపించారు.

 

ఇది తారకాసుర సంహార ఘట్టం అని సూత మహాముని సౌనకాది మునులకు తెలియచేసాడు 

 

 

ఇవే పంచారామాలు. 

 

 

1. *దాక్షారామము* –

 

భీమేశ్వర స్వామి కొలువైన దాక్షారామం పంచారామాల్లో మొదటిది. దాక్షారామం త్రిలింగ క్షేత్రాలైన శ్రీశైలం, కాళేశ్వరాలలో ఒకటి. అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇంత శక్తివంతమైన దాక్షారామాన్ని దక్షిణ కాశి అంటారు 

దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. 

 పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది. 

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది. 

అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు. 

ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 

ఈ దేవాలయము దేవతలు నిర్మించారని తెల్లవారిపోయేసరికి ప్రహరీగోడ లోని ఒక మూల పూర్తి కాకుండా నిలిచి పోయిందని చెప్పుదురు. దీనిని ఎన్ని సార్లు కట్టిననూ పడిపోవుచున్నదట.  

ద్రాక్షారామము భోగానికి, మోక్షానికి, పావనానికి ప్రసిద్ధ పుణ్య క్షేత్రము.శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది.  

స్వామివారిని అర్చించడానికి సప్తర్షులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని అందుకే అంతర్వాహినిగా ప్రవహించే  

గోదావరిని సప్తగోదావరి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి 

భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర శివలింగాలు దర్శనమిస్తాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కులో ఉన్న గోపురాలను ఒక్కో అమ్మవారు పర్వవేక్షిస్తున్నట్లుగా స్థలపురాణం వివరిస్తుంది. భీమేశ్వరునికి ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని చెబుతారు. తూర్పున కోలం, పడమరన వెంటూరు, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయాన దంగేరు, నైరుతిన కోరుమిల్లి, పశ్చిమాన సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమళ్ళలో ఈ అష్ట సోమేశ్వరాయాలున్నవి.  

ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబా దేవి. శ్రీచక్రంతో విరాజిల్లుతుంది. ఇక్కడ స్వామివారి దేవేరి పార్వతీదేవి, అష్టాదశ పీఠాలో 12వ పీఠం మాణిక్యాంబా పీఠంగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో శ్రీడుండి విఘ్నేశ్వరుడు, అశ్వర్థనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నటరాజు, వీరభద్రుడు, మహిషాసురమర్ధని, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఆంజనేయస్వామి వారిని కూడా దర్శించవచ్చు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు.  

శ్రీనాధ కవిసౌర్వభౌముడు తన భీమేశ్వరపురాణంలో ఈ క్షేత్రం గురించి విశేషంగా వర్ణిస్తాడు. దుష్యంతుడు, నలమహారాజు, భరతుడు, నహుషుడు ఈ ఆలయాన్ని దర్శించారని వ్రాశాడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమేశ్వరుడు క్రీ॥శ॥ 7-8 శతాబ్దాల మధ్య కట్టించాడు. ఇంకా అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి వివరించారు. ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.


2. *అమరారామము* –

 

అమరలింగేశ్వరాలయం ఉన్న అమరారామం పంచారామాల్లో రెండవది. శివుడు ఆత్మలింగం తునియలను ప్రతిష్టించమని చెప్పగా, దేవేంద్రుడు ఆత్మలింగంలోని అతి పెద్దభాగం పడిన ప్రదేశానికి వెళ్లాడు. ఆ తునియ వెంటనే లింగాకృతి చెంది పరిమాణం పెరగసాగింది. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు ఇంద్రుడు లింగాన్ని పూజించి ప్రతిష్టించాడు. రాక్షసులను నాశనం చేసే శక్తిని సమకూర్చమంటూ మూడుకోట్ల దేవతలూ పూజించారు.


 

అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. ఈ దేవాలయం కొద్ది ఎత్తులో ఉన్న క్రౌంచగిరి అనే శిల మీద ఉంటుంది.  

దేవత గురువు బృహస్పతి మరియు రాక్షసుల గురువు శుక్రాచార్యులు ఇక్కడ శివభగవానుడిని సేవించారు. ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ద్రవిడ శిల్పరీతిలో కట్టబడిన ఎత్తయిన గోపురాలున్నాయి 

 శాతవాహనులు పరిపాలించిన కాలములో అమరావతి రాజధాని ధాన్య కటకము, ధరణికోట అని పేర్లు ఉండేవి. అమరేశ్వర లింగము దేవేంద్రునిచే ప్రతిష్టించబడింది. లింగము పెరుగుటచే చీల కొట్టారని అంతట పెరుగుదల ఆగిపోయిందని చెప్పుదురు. చీల కొట్టినపుడు రక్తము ధారగా కారినట్లు లింగముఫై  కన్పించుచుండును 

చాలా పొడవయిన లింగము. ఫై అంతస్తు ఎక్కి అభిషేకము పూజలు చేయాలి. దేవాలయ ప్రాంగణములో 108 శివలింగములు కలవు అమ్మవారు రాజ్యలక్ష్మి. బాల చాముండిక అను పేరు కూడా కలదు. ఇక్కడ ఏకాదశ  

రుద్రాభిషేకము ప్రత్యేకత. అమరావతి స్థూపము దగ్గరలో కలదు. మ్యూజియం కలదు. ఇది బౌద్ధ క్షేత్రము.     

 

3*క్షీరారామము* -


 పంచారామాల్లో మూడవది క్షీరారామం.


 రామలింగేశ్వరస్వామి కొలువైన క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. 


ఈ ప్రాంత ప్రజలకు తగినన్ని పాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో , శివభక్తుడైన ఉపమన్యుకోసం  శివుడు భూమిలోకి బాణమేయగా పాలు ధారగా వచ్చాయట. పాలు క్షీరమంటారు. అందుకే ఈ ప్రాంతానికి క్షీరపురి అని పేరొచ్చింది.అదే వ్యవహారంలో పాలకొల్లుగా మారింది. 


ఇక్కడి లింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్టించారని చెప్పే కథలున్నాయి.

 

ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది. 

పార్వతి పరమేశ్వరులు, లక్ష్మి జనార్దనులు, సరస్వతి బ్రహ్మలు ఉన్నందున ఈ దేవాలయమునకు త్రిమూర్త్యాలయము అని పేరు.


 దీనిని హరిహర క్షేత్రమని పిలుస్తారు. లింగము శిరస్సున చిన్న ముడి ఉన్నట్లుగాను, కొమ్ము ఉన్నట్లు గాను  

కనిపిస్తుంది .శివలింగం పైభాగం మొనతేలి ఉండటం వలన ఈ స్వామిని కొప్పురామలింగేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. 

లింగము తెలుపు రంగులో ఉంటుంది. 


ఇచట లింగమును దర్శించిన వారికి దారిద్ర్య బాధ కలుగదని ప్రతీతి.

 


ఈ దేవాలయం క్రీ॥శ॥  

10-11 శతాబ్ధాల మధ్య చాళుక్యు రాజులచే నిర్మించబడినది. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తున ఉంటుంది. గోపురం నిర్మించటానికి ఒక్కో అంతస్తు నిర్మించి దాని చుట్టూ మట్టిపోసి దానిమీద రాకపోకలు సాగించి ఇంకో అంతస్తు నిర్మించారట.అలా తవ్వగా ఏర్పడిన చెరువే రామగండం చెరువుగా పిలుపబడుతుంది. ఇది దేవాలయంనకు దగ్గరలోనే ఉన్నది. శివుడు పార్వతీసమేతుడై రామలింగేశ్వరుడుగా వెలసిన పుణ్యక్షేత్రం క్షీరారామం. శివలింగం పాలరంగులో మెరుస్తూ భక్తులను పారవశ్యం చేస్తుంది. మహావిష్ణువు ఈ క్షేత్రపాలకుడు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకారమండపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు.  

పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, ఋణహార గణపతి కొలువై ఉన్నారు. ఋణహార గణపతిని దర్శిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారని శాసనాల ద్వారా తెలుస్తుంది.

 

 

4. సోమారామము

 

పంచారామాల్లో నాలుగవది సోమారామం. 


ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షేత్రంలోని స్వామివారిని చంద్రుడు ప్రతిష్టించారని చెబుతారు. సోమేశ్వరస్వామి ఆలయం పశిమ గోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో ఉంది. ఈ ఆలయానికో విశిష్టత ఉంది. మామూలు రోజులలో తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం అమావాస్యనాడు గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమినాటికి తెలుపురంగులోకి మారుతుంది.


 సోమేశ్వరస్వామితోపాటు అన్నపూర్ణాదేవికి పూజలు జరుపుతారుచంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది. ఈ లింగమును ప్రార్ధించిన వారికి సర్వ వ్యాధులు తోలగునని పంచ మహా పాపములు హరిన్చునాని నమ్మిక.దేవాలయానికి ఎదురుగా చంద్రకుండం అనే చెరువు కలదు. దీనిని కూడా చంద్రుడే ఏర్పాటు చేశాడని స్ధలపురాణం. ఈ చెరువు తామర పువ్వులతో నిండి వుంటుంది.

 

5. కుమార భీమారామము

 – 

పంచారామాల్లో ఐదవది కుమార భీమారామం. 


కుమార లింగేశ్వరస్వామి కొలువైన దేవాలయం. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించాడు. ఈ స్వామిని కాలభైరవుడు అని కూడా పిలుస్తారు. 


ఈ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది.  

ఇక్కడి శివలింగం సున్నపు రాతితో రూపొందింది. తెల్లగా ఉంటుంది కనుక స్ఫటిక లింగం అని కూడా పిలుస్తారు.


 

ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 

చాళుక్య రాజులలో ఒకడగు భీమునికి రాజధానిగా ఉండుటచే ఈ ప్రాంతమును భీమవరమని పేరు. శివుడు చాళుక్య భీమేశ్వరుడు,శివ కుమారుడయిన కుమారస్వామిచే పూజలందుకున్నది కావున కుమారారమమని పేరు వచ్చింది. 

 దీనిని స్కంధరామమని కూడా అంటారు. ఇక్కడ కూడా లింగము చాల పెద్దది. అమ్మవారు శ్యామల దేవి.


 

లోపలి ప్రాకారాన్ని రెండు అంతస్తులతో నిర్మించారు. కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగం రెండస్తుల ఎత్తు ఉంటుంది. మహాశివుడిని అభిషేకించాలంటే రెండో అంతస్తు నుండి చేయాల్సిందే. అప్పటికి గాని రుద్రభాగానికి పూజ పూర్తవుంది.


కాలభైరవుడు ఈ క్షేత్రపాలకుడు. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దుర్గాదేవి, విష్ణుమూర్తి, బాలాత్రిపురసుందరి అమ్మవారు తదితర ఉపాలయాలు ఉన్నాయి. వసంత నవరాత్రులు మొదలు మొదట నాలుగు నెలల కాలంలో సూర్యకిరణాలు ప్రభాత కాలంలో మూలవిరాట్టునూ ప్రదోష సమయంలో బాత్రిపురాసుందరి అమ్మవారిని తాకుతాయి. ఏకశిలా నంది విగ్రహం,ఊయల మండపం, నాటి శిల్ప కళానైపుణ్యానికి తార్కాణాలు.


ఊయల మండపాన్ని కాస్తంత ఊపితే కాస్తంత కదుతున్నట్టు ప్రకంపనలు వస్తాయి.  

నందీశ్వరుడి వైభవాన్ని చూడాల్సిందే. మొడలో గంటతో, శివలింగమంత మూపురంతో రాజసంగా ఉంటుందీ విగ్రహం. ఆలయ నిర్మాణసమయంలో శ్రమజీవులకు మజ్జిగ పోసిన గ్లానును మరచిపోకుండా సుమారు యాభై అడుగు ఎత్తున్న గొల్ల స్థంభాన్ని ఏకశిలలో నిర్మించారు. .  

ఈ పార్ధివ లింగ భాగములు పడిన ఐదు చోట్ల ఓంకారనాదము తో ప్రతిష్టింపబడెను. ఈ లింగ భాగముల మీద ఆగ్నేయాస్త్రము ఘాతములచే ఏర్పడిన గుర్తులు నేటికీ కనబడుతాయి.


మయూరాధి రూఢం మహా వాక్య గూఢం

మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం |

మహీ దేవ దేవం మహా వేద భావం

మహాదేవ బాలం భజే లోకపాలం !! 


  🔱   *ఓం శరవణ భవ* 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat