🔱 *కుమారచరిత్ర* -13 🔱

P Madhav Kumar


*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః* 

 

తారకాసుర సంహార ఘట్టం

 

యుద్ద సమారంభములో ప్రముఖులందరిని సమాయుత్తపరిచి కుమార స్వామి విశాఖుడిని రాయబారిగా తారకుని వద్దకు  పంపాడు. 


ఆ రాయబారం విఫలమవటంతో యుద్ధం అనివార్య మయ్యింది.

 

కుమార స్వామి సైన్యాధ్యక్షుడి గా దేవత సమూహము తారకాసురినితో యుద్దానికి సంసిద్దమైనారు .

 

 ఇరుపక్షాల మధ్య భీకర పోరు ప్రారంభమైనది. ఎక్కడ చూసిన తలలు తెగిన గుర్రాలు , కాళ్ళు తెగిన ఏనుగులు , తెగిన రాక్షసుల మొండేల నుండి ప్రవహిస్తున్న రక్తపుటేరులతొ అంతా భీభత్సంగా ఉంది .

  

ఇంతలో తారకుడు తన వద్ధ వున్నా శక్తి ఆయుధాన్ని ఇంద్రునిపై ప్రయోగించాడు . అది ఇంద్రుని వాహనమైన ఐరావతానికి తగిలి అది మూర్ఛపోయింది .


 వెంటనే ఇంద్రుడు వజ్రాయుధముతో తారకుని ఎదుర్కున్నాడు

  

తారకాసురుడు  తేరుకుని కోపోద్రిక్తుడై పరమేశ్వర ప్రసాదితమైన శక్తీ ఆయుధాన్ని ఇంద్రునిపై ప్రయోగించాడు .దానితో ఇంద్రుడు నేలకొరిగాడు 

 తారకాసురురుడు కింద బడ్డ ఇంద్రుణ్ణి హింసించ సాగాడు . 

 

ఇదంతా చూస్తున్న దేవతలు గగ్గోలు పెట్టారు .


 ధర్మవిరుద్ధమైన తారకుని చేష్టలకు కుమారస్వామి ఆగ్రహంతో రుద్రుడే అయ్యాడు .

  

ప్రళయ తాండవం చేస్తున్న కుమారస్వామి ని చూసి తారకుని మనస్సులో ఏదో ఆందోళన మొదలైంది . 

 

ఆ రాత్రి అంతా శివ ధ్యానం తో గడిపాడు .  

శివుని లింగానికి పూజలు నిర్వహించి తరుణోపాయాన్ని సూచించమని శివుని వేడుకున్నాడు .


 అతని ప్రార్థనలకు సంతసించిన పరమేశ్వరుడు దయాళుడై అదృశ్య రూపంలో తారకునితో ఈ విధంగా పలికాడు . తారక ఇది నువ్వు కోరుకున్నదే కేవలం నా వల్ల జన్మించిన పుత్రుని చేతుల్లో నీ మరణాన్ని కోరుకున్నావు .  

కుమార స్వామి నా పుత్రుడు . కేవలం నాకు మాత్రమే పుత్రుడు కాబట్టి అతని చేతులలో నీ మరణం తప్పదు .అయినా నా భక్తుడివి కాబట్టి నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అన్నాడు .


అప్పుడు తారకుడు మహేశ్వరునితో ఈ విధంగా పలికాడు ..


స్వామీ ఇప్పటివరకు నీ దయతో ముల్లోకాలను పాలించాను . కానీ ఇప్పుడు ఆ వాంఛ లేదు . కేవలం నీ మీద భక్తీ తప్ప వేరే ఆలోచన లేదు . నా మీద కరుణతో నీవు ప్రసాదించిన ఆత్మా లింగాన్ని సదా నా కంఠ సీమలో ధరిస్తూ వచ్చాను.  

నా నిర్యాణం తరువాత దీని పరిస్థితి ఏమిటి అని నా ఆందోళన తో ప్రార్ధించగా ...పరమశివుడు దయాళుడై భక్తా నీ తరువాత కూడా ఈ దివ్యలింగం మోక్షకారకాలు కాగలవు అని దీవించి అంతర్దానమయ్యాడు .


 

మరునాడు కుమార స్వామి , తారకాసురుల మధ్య భీషణ పోరు జరిగింది .కుమార స్వామి ప్రయోగించిన అస్త్రాలన్ని ఆత్మలింగ ప్రభావము వల్ల వ్యర్దాలయినాయి .

 

తారకుడు దేవగణాలపై మయుడు ఇచ్చిన మహాశక్తి అస్త్రాన్ని మంత్రపూర్వకముగా ప్రయోగించగా దేవగణాలన్నీ నిశ్చేష్టులైనాయి . 


వెంటనే షణ్ముఖుడు దానిని నిరోధించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .

 

అలా వారివురకు ఇరవై రోజులపాటు భీకర పోరు కొనసాగింది . వారి అస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లసాగాయి


నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం

లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం

శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం

బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే !! 


  🔱   *ఓం శరవణ భవ* 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat