🔱 కుమారచరిత్ర -19 🔱

P Madhav Kumar


శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః  

 

 వల్లీ  సుబ్రహ్మణ్యుల కళ్యాణం

 

ఒకానొక సమయంలో నారదమహర్షి "తణికై" అనే ప్రదేశంలో ఉన్న సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. 

 

లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు.ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు....

 

తొండైనాడు దేశంలో "మేర్పట్టి" అనే గ్రామ పొలిమేర్లలో వల్లిమలై [ వల్లికొండలు ] ఉన్నాయి.  

ఆ గ్రామంలోనే నంబి అనే పుళిందుడు ఉండేవాడు. [ పుళిందులు అంటే వేటాడి జీవనం సాగించేవారు అని ].  

ఒకరోజు నంబి, అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూండగా వారు, ఓ శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూసారు. 

ఆడపిల్లలు లేనిలోటు ఆ దేవుడు ఈ రూపంలో తీర్చాడు అనుకొని, ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దాడి, తమ ఇంటికి తీసుకొని పోయారు. 

 

తమ జీవనాధారం ఐన వల్లికొండల మద్య దొరికింది కాబట్టి "వల్లి" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచసాగారు. 

 

భగవంతునిపై భక్తి, పెద్దలపట్ల గౌరవము, వినయ విధేయతలతో వల్లి పెరిగింది.ఆమె రాశీభూతమయిన సౌందర్యము.  అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడు. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు.. అన్నాడు నారదుడు. 


ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. 

 

ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి  పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. 


నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు  శంకరుని తేజమును పొందిన వాడో,ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం 'అన్నాడు. 


భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు.

 

కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. 

 ఆవిడ ఈయన వంక చూసి ‘ 

‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. 

 

అంతట కుమారస్వామి వల్లి ని చేరి, తన స్వపరిచయం చేసుకొనిపెళ్ళాడమని కోరాడు, ఇంతలో వల్లి తల్లితండ్రులు, అనుచరులు వస్తూండటం చూసి, ముసలి శివభక్తుని రూపంలో మారిపోయాడు.

 వచ్చినవారు ఆ శివభక్తుని రూపంలో ఉన్న కుమారస్వామి కి నమస్కరించి వెళ్ళిపోయారు.

 వారు వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఓ గజరాజు వల్లి పైన దాడిచేసింది, కుమారస్వామి ఆమెను రక్షించాడు.

  

పార్వతీ తనయుడు తన వాహనమైన నెమలి ఎక్కి, 12 హస్తాలను కలిగి ఉండి. సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధధారుడై, కుకుటధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యమును నిర్వహించునట్లు వల్లిదేవికి దర్శనం ఇచ్చాడు. 

 ఆ దివ్యస్వరూపాన్ని చూసి, కుమరస్వామికి పాదాభివందనం చేసి పెళ్ళికి సుముఖం వ్యక్తంపరచింది. 

 

ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంగి ఏడుస్తోంది.  

అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. 

 

ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది.అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదాo అన్నాడు.  

అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది.  

వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. 


భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు.  

సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు 

సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వా టినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. 

 

వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు.


ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.స్వామి నంబి రాజన్ వద్దకు వెళ్లి తన కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యమని అడుగుతారు.అప్పుడు నంబి రాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని కుమారుడైన కుముదుని కుమార్తె అని , 

కానీ ఈమె మా ఇంట పెరుగుచున్నది, వల్లి నాగస్వరూపిణి కావటం వల్ల నాగస్వరూపుడిని మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా కుమారస్వామి సర్పరూపంలోవల్లిదేవి ని వివాహం చేసుకోటానికి సంసిద్ధుడవుతాడు ఇంతలోనారదుడు దేవసేన, పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. 

 

నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. 

కొండజాతి ఆచారం ప్రకారం. వధూవరులను కూర్చోబెట్టి, వినాయకుడి సమక్షంలో, శివపార్వతుల ఆశీర్వాదంతో, దేవసేన అంగీకారంతో, దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా వల్లీ సుబ్రహ్మణ్యస్వామి ల వివాహం ఆనందదాయకంగా జరిగింది.

 

ఒక కొండజాతి పిల్లను చేసుకొన్నందుకు ఙ్ఞాపకార్ధంగా సుబ్రహ్మణ్యస్వామి కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని మాట ఇచ్చాడు. అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ క్షేత్రాలన్ని కొండలపైనే వెలసి ఉన్నాయి.

 

 పార్వతీ పరమేశ్వరులతోమరియు దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. 


 

సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది. 

కుమారస్వామి పాముగా మారి వివాహం చేసుకున్న రోజు మార్గశిర శుక్లపక్ష షష్టి. పాము బ్రహ్మజ్ఞానానికి, కుండలినికి ప్రతీక కావున నువ్వు బ్రహ్మణ్య దేవుడివి, సుబ్రమణ్యడివి, మంచి పరబ్రహ్మ స్వరూపుడువి అని వల్లిదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు. కావున కుమారస్వామి ని సుబ్రమణ్యస్వామి అని కూడా కొలుస్తారు

 

వల్లీ అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. 

ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రము నందు ఉంటుంది.అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.

 

శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వైభవమును తలచుకుని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమౌదాము. 


  🔱   ఓం శరవణ భవ 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 * జైశ్రీమన్నారాయణ* 🌸


🙏 ఓం శరవణ భవ🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat