🔱 కుమారచరిత్ర -21 🔱

P Madhav Kumar

 శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః 

పరమశివునికీ ప్రణవ ఉపదేశం

 

ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు స్వామిగా.


 ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది, 


శంకరుడు సకల జ్ఞానములకు ఆలవాలము. ఈశానః సర్వ విద్యానాం అంటారు కదా. 


 ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే,  

ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి. 


లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము.

 

ఒకసారి సృష్టకర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి వెళుతూ..ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు.


 కనబడ్డవాడు వూరుకొనక, ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు. పాపం దేవలకు కూడా తెలియని ప్రశ్నతో బ్రహ్మతో పాటు ఇతర దేవుళ్ళను అయోమయంలో పడేశాడు


 

బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పకపోయే సరికి ఆయన్ని బందీ చేశాడు. 


సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మ దేవుడు బందీ అయ్యే సరికి సృష్టి ఆగిపోయింది.


 దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నవించారు.


 

అందరూ కలసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు.


 అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు, ...


బ్రహ్మదేవున్ని ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు. అందుకే బందీని చేశానని సమాధానం చెప్పి, ఇందులో తన తప్పు ఏమి లేదని చెప్పాడు. 

 

అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు. ఆయనకి తెలియదని బందీని చేశావు సరే. మరి నీకు తెలుసా అని అడుగగా నేను చెప్తాను అన్నాడు.

 

కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్దలున్న శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు. తర్వాతేముంది కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. తండ్రి అత్యంత భక్తి శ్రద్దలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు.


 

మరో పురాణ కథనం కూడా ఉంది. 


భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఝానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. 

 

ఆ తపోశక్తి ఊర్థ్వలోకాలకి వ్యాపించగా , ఆ వేడిమిని భరించలేని దేవదేవుళ్ళు ఆ పరమేశ్వరుని శరణు కోరారు.

 

అప్పుడు ఈశ్వరుడు ఆతపశ్శక్తి దేవలోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు.

 దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఝానం నశించింది. భృగుమహర్షి పరమేశ్వరుని స్తుతించాడు

 

పరమేశ్వరుడు భృగు మహర్షిని ఆశీర్వదించి ఋషిపుంగవా నీ ఆంతర్యంలో దర్శన మెుసంగి నీ తపస్సును భంగమెునరించిన కారణంగా నా జ్ఞానం నానుండి జారిపోయింది అని అన్నాడు. 

అప్పుడు భృగుమహర్షి పరమేశ్వరునికి నమస్కరించి పరమేశ్వరా స్వామిమలైలో వున్న కుమారస్వామి నుండి ఉపదేశము పొందమని చెబుతాడు.


 

పరమేశ్వరుడు స్వామిమలై వచ్చి అక్కడి సుబ్రమణ్యేశ్వరస్వామి దగ్గర పంచాక్షరీ ఉపదేశం పొంది తన స్మృతిని తిరిగి పొందుతాడు.


అందరికి ప్రభువైన శివునికే ఉపదేశం చేయటం చేత ఇక్కడి స్వామికి స్వామినాధుడు అని పేరు వచ్చింది.


  🔱   ఓం శరవణ భవ 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 జై శ్రీమన్నారాయణ🌸


🙏 ఓం శరవణ భవ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat