శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 23 వ భాగము

P Madhav Kumar


శ్రీ అప్పణాచార్యుల సౌభాగ్యము


శ్రీరాఘవేంద్రస్వామి శ్రీహరి భక్తాగ్రగణ్యులు. శ్రీహరి, శ్రీ వాయువు, (ప్రాణరూప మున సర్వత్ర వ్యాపకమై యున్న శ్రీహరి చైతన్య రూపము) సాక్షాత్తుగ శ్రీవారి బృందావనమందు విరాజిల్లి యున్నారు. సర్వతంత్ర స్వతంత్రుడైన ఆపరబ్రహ్మమే స్వయముగ తన సన్నిధానము నొసంగిన ఆ బృందావన మందు సకలదేవతలు, తీర్థములు, ధామములు ఉండుట నిర్వివాదాంశము


శ్రీవారు శ్రీహరి, వాయువు లను ధ్యానించుచు ఆ బృందావన మందు విరాజిల్లిరి. ఈబృందావన వృత్తాంతము శ్రీవారి కత్యంత సన్నిహితులైన అప్పణాచార్యుల వారికి తెలియరాలేదు. ఆ సమయములో ఆయన కొన్ని గృహకార్యముల కొరకై బిచ్చాలె యను గ్రామమునకు వెడలి యుండెను. స్వగ్రామము నకు మరలిరాగానే శ్రీరాఘవేంద్రస్వామి బృందా వన వృత్తాంతము పిడుగు పాటు వలె ఆయనకు తెలిసెను. అపుడు  శ్రీఅప్పణాచార్యులు హృద య విదారకముగ విలపిం చుచు 'గురుదేవా నాకు మీ  అంతిమ దర్శనము నేల ప్రసాదింపలేదు? మీ అంతిమ ఉపదేశము విను సౌభాగ్యము  నాకులేకుండ చేసితిరి. పూర్వజన్మము లందు "నేనే పాపము  చేసితినోగదా!' యని పలుకుచు ఆక్షణమందే బృందావన దర్శనాకాంక్షి యై పరుగు పరుగున మంచాలకు బయలు దేరెను. దారిలో శ్రీరాఘ వేంద్రుని యనేక విధముల స్తుతించుచు ఆనందభాష్ప నయనుడై పులకితదేహుడై మంచాల చేరెను. ఆయన హృదయము నుండి  ఆశువుగ సంస్కృతములో ఒక మహాస్తోత్రము వెలువడెను. 


శ్రీఅప్పణాచార్యులు  31 శ్లోకమునందు మూడవ పాదము ఉచ్ఛరించు చుండగ బృందావన సమ్ముఖమునకు జేరెను. వెంటనే ఆయన భక్తి సమన్వితుడై సాష్టాంగ దండప్రణామ మాచరించి శ్రీ గురుదేవుల వియోగము ను భరింపజాలక విలపిం చెను. ఆయన తదనంతర ము తన్ను తాను సంబాళించుకొని గురు దేవుల పాదపాద్మము లందు తన మనస్సు నేకాగ్రమొనర్చెను. ఈ విచిత్ర ఘట్టమును వేలకొలది భక్తులు ఆశ్చర్య చకితులై వీక్షించుచుండిరి. ఆ సమయములో శ్రీ అప్పణాచార్యునిలో తన స్తోత్రమందు ఆశువుగ వచ్చిన శ్రీరాఘవేంద్ర స్వామి దివ్య లీలా విభూతులు సంభవమా! యని జీవసహజమైన శంక ఉద్భవించెను. ఆక్షణమందే బృందావనము నుండి “సాక్షి హయాస్యో త్రహి" అనుచు మేఘగంభీర స్వరము ప్రతిధ్వనించెను. ఈ వాక్యమే అప్పణా చార్యుని స్తోత్రములోని ముప్పది యొకటవ శ్లోకమునకు చతుర్ధపాద మయ్యెను.


ఈస్తోత్రమందలి ప్రత్యక్ష రము పరమ సత్యమని దానికి నేను సాక్షినని ఆ మహావాక్యమున కర్థము. ఈ దివ్య వాక్యమును శ్రీ బృందావనమునందు వేం చేసియున్న శ్రీహయగ్రీవ స్వామిపల్కెను. తదనంత రము శ్రీ అప్పణాచార్యులు మరి యొక శ్లోకమును చదివి శ్రీరాఘవేంద్ర స్తోత్రము ముప్పదిరెండు (32) శ్లోకములతో పరిపూర్ణ మొనరించెను. ఆ సమయము నుండి శ్రీ అప్పణాచార్యుల ముఖార విందము నుండి ఆశువుగా వెలువడి హయవదను డైన శ్రీహరిచే సత్యమని చెప్పబడిన శ్రీ రాఘవేంద్ర స్తోత్రము శ్రీవారి అధికార స్తోత్ర మయ్యెను.


శ్రీవారు బృందావన ప్రవేశ సమయమున ఆ ప్రదేశమున యుండుటకు నోచుకొనని శ్రీఅప్పణా చార్యుల ముఖము నుండి శ్రీ రాఘవేంద్ర స్తోత్రమును బలికించి శ్రీహరి ఆయన కీర్తిని ఆచంద్రతారార్క మొనరించెను. గురు దేవుని యను గ్రహమునకు పాత్రుడైన శిష్యుని భగవంతుడే స్వయముగ ఉద్ధరించును.


శ్రీ అప్పణాచార్యుని యీ పరమాదృష్టమునకు శ్రీ వారియెడ వానికి గల అకుంఠితమైన అనన్య భక్తియే కారణము. పాఠకుల సౌకర్యార్థమై పరమభాగవతులైన శ్రీ అప్పణాచార్యులు రచిం చిన శ్రీ రాఘవేంద్ర స్తోత్రమును మీ ముందు ఉంచుచున్నాము.  


సూర్యోదయం సమయ మందు స్నానమాచరించి శ్రీరాఘవేంద్రస్వామి బృందా వన సమ్ముఖమున గాని, ఆయన విగ్రహ సమ్ముఖ మున గాని బృందావన మృత్తికచే అలంకరింపబడి చిత్రపట సమ్ముఖమందు గాని నిలువబడి భక్తితో తలనువంచి హస్తములను ముకుళించి ఒక్క పర్యాయ మైనను ఈ స్తోత్రమును పఠించినచో పఠించిన వానికి సర్వ అభీష్టములు సిద్ధించును. నూటయెనిమి ది పర్యాయములు పఠిం చిన వాని సకల రోగములు, భయము, దుష్టగ్రహ దోషములు, భూత ప్రేత పిశాచాదుల బాధలు తొలగి వానికి మనశ్శాంతి లభించును.


'ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః' అను మంత్రము నైనను నూటఎనిమిది పర్యాయములు ప్రతి దినము స్నానానంతరము జపించినచో సర్వాభీష్టసిద్ధి గల్గునని శ్రీఅప్పణాచార్యు లు నొక్కివక్కాణించిరి.


శ్రీనారాయణ పండితా చార్యులు వాయుస్తుతిని ప్రవచించుచు ఆదిలో రెండుశ్లోకములుగ శ్రీలక్ష్మీ నృసింహస్వామిని ప్రస్తు తించి శ్రీఅప్పణాచార్యులీ స్తోత్ర నిర్మాణమందు ప్రప్రధమమున శ్రీవారి వాక్స్వరూపుడగు శ్రీ వాయుదేవుని ప్రస్తుతిం చుచు మంగళాచరణ మొనరించెను.


ఈస్తోత్రము భక్తులపై దివ్యశక్తులను కురిపించు ను. ఉత్తరాది మఠమందు శ్రీసత్యధర్మ తీర్థులను పీఠాధీశ్వరులు శ్రీ రాఘ వేంద్రస్వామి అనన్య భక్తులైరి. వారు తమ బృందావనమును శ్రీ రాఘవేంద్రస్వామి స్తోత్ర పఠనముతో ఆరాధింప వలసినదిగ తన శిష్యుల నాజ్ఞాపించిరి. నేటివరకు ఆమఠమందు అట్లే ఆచరిం ప బడుచుండెను.


శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి నుండి ఎనిమిదవ తరమువాడైన శ్రీధీరేంద్ర తీర్థస్వామి ప్రసిద్ధులు.వీరు శ్రీవారి యనన్య భక్తులు. ఈ మహాత్ముడు అనేక ఘోరతపముల నాచరించి దివ్యశక్తి సమన్వితుడు అయ్యెను. వీరి బృందా వనము ధార్వార్ జిల్లాలోని 'హోసరిట్టి' గ్రామమున గలదు. ఆ బృందావన మందు శ్రీ ధీరేంద్ర తీర్ణులవారు తనయంశచే విరాజిల్లుచు భక్తుల నను గ్రహించుచున్నారు. వారితో శ్రీరాఘవేంద్రస్వామి కూడ తమ యంశతో ఆబృందా వనమున విరాజిల్లి యున్నారని భక్తుల విశ్వాసము. 


ఆ బృందావనమునకు సేవల నొనరించి, ఆరాధించి ‘హోసరిట్టి’ గ్రామములో భక్తితోమూడు నిద్రలు చేయు భక్తులకు స్వప్నమందు ఇరువురు బ్రాహ్మణోత్తములు సాక్షా త్కరించెదరు. ఒకరు తెల్లని వర్ణముగలిగి సన్నగా పొడవుగ నుందురు.  వారే శ్రీధీరేంద్ర తీర్థులు. మరియొకరు అంగ సౌష్టవముగల్గి  కృష్ణవర్ణముతో నుందురు. వారే శ్రీరాఘవేంద్రస్వామి. వీరిర్వురు స్వప్నమందు నేటికిని భక్తులననుగ్రహిం చుచున్నారు.


శ్రీ సత్యానంద తీర్థులను మరియొక పీఠాధీశ్వరులు గలరు. వారుకూడ శ్రీ రాఘ వేంద్రస్వామికి ఏకాంత భక్తులు, తపస్సంపన్నులు. వారి బృందావనము బీజాపురమునకు దగ్గరలో కలదు. శ్రీరాఘవేంద్ర స్వామికి వీరిపైగల అనుగ్రహవశమున తమ యంశతో ఆ బృందావన మందు విరాజిల్లి యున్నారు. నేటికిని శ్రీసత్యేంద్ర తీర్థుల బృందావన ఆరాధన సమయమందు నిత్యము శ్రీ రాఘవేంద్రస్తోత్రమును పఠించెదరు. కావున సర్వ జనులు శ్రీ రాఘవేంద్ర స్తోత్రపఠనముచే తాపత్ర యములనుండి విముక్తి బొంది పరమానందమనుభ వించవచ్చును. నేటికిని యిర్వురు యతీశ్వరులు తమ బృందా వనము లందు సజీవముగ వేంచేసి యుండి ఆశ్రిత భక్తులపై తమ కృపాకటాక్ష వీక్షణ ములను ప్రసరింపజేసి అనుగ్రహించు చున్నారు. వాదెసోడే మఠమునందు న్న శ్రీవాదిరాజ స్వామి, మంత్రాలయ మఠమందు ఉన్న శ్రీరాఘవేంద్రస్వామి, నేటికి వారు తమ భక్తులకు బృందావనము ముందుగాని, స్వప్నము నందుగాని దర్శనమొసంగు చున్నారు. భక్తులతో సంభాషించు చున్నారు, ఇది అక్షర సత్యము.


శ్రీవాది రాజస్వామి సాక్షాత్తుగ శ్రీవాయుదేవుని యవతారము. వారు తరువాతి కల్పములో స్వస్థానమైన శ్రీవాయు పీఠమును జేరెదరు. ఆ వాయుదేవుడే నేడు  పూర్ణాంశతో శ్రీరాఘవేంద్రు ని బృందావనమును ఆవహించియున్నారు. శ్రీవారి బృందావన మందు ద్వాదశక్షేత్ర సాలగ్రామము లను, ఏడువందల శ్రీహరి వివిధ రూపములైన సాల గ్రామములను ఉంచిరి.


ముప్పది మూడుకోట్ల దేవతలను ఆవాహన మొనరించి యుంచిరి. శ్రీవారి బృందావనమందు సాక్షాత్తుగ శ్రీహరి, వాయు దేవులు విరాజిల్లి యున్నారు. బృందావన సమక్షమున శ్రీ రాఘవేంద్ర స్తోత్రమును పఠించిన భక్తులను బృందావన మందున్న శ్రీహరి వాయువులు తక్షణమే అనుగ్రహించు చున్నారు.


భక్తులు శ్రీరాఘవేంద్రుని యొక్క దివ్యచరణార విందముల నాశ్రయించి శ్రీహరి వాయుదేవుల అనుగ్రహమునకు పాత్రు లగుచున్నారు.


శ్రీ  అప్పణా చార్యులు రాఘవేంద్రస్వామిని కల్ప వృక్షమని సంబోధించిరి. ఏలయనగ మంచాల గ్రామమునకు జని శ్రీవారి బృందావనము చెంత స్తోత్రమొనరించిన భక్తు లను శ్రీవారు కల్పవృక్షము వలె వారి సర్వాభీష్ట ములను తీర్చుచున్నారు.


అప్పణాచార్యులు శ్రీ రాఘ వేంద్ర స్వామిని కామధేను వని  స్తుతించిరి. కామ ధేనువు తన భక్తులనను గ్రహించుటకు ఈ విశ్వ మందు ఎచటికైనను పోగలదు. అట్లే శ్రీవారు తన భక్తుల ఆర్తనాదముల నాలకించగనే, వారెచ్చోట నున్ననూ అచటి కేగుదెంచి వారి ననుగ్రహించుదురు. శ్రీవారి బృందావనము నుండి మృత్తికనుగొని ప్రపంచమందుగల అనేక పట్టణములలో ఆరాధ నార్థమై బృందావనము లను నిర్మించిరి. ఆబృందా వనములందు “శ్రీవారు  తమయంశలను  విరాజిల్ల జేసియున్నారు.


కొందఱు భక్తులు శ్రీవారి బృందావన మృత్తికను దెచ్చుకొని స్వగృహముల యందే శ్రీవారిబృందావన, చిత్రపటములకు  అలంక రించుకొని ఆరాధించు చున్నారు. వారు జీవిత మంతయు స్వామి వారి యనుగ్రహమునకు పాత్రులై అంత్యకాల మందు భవబంధవిముక్తు లగుచున్నారు.


మంత్రాలయమునకు 9 మైళ్ళ దూరములో మంత్రాలయం గ్రామము నందుగల  బృందావనము నకు  అణుమంత్రాలయ మని పేరు. వాటికి శాఖా బృందావనములు అసంఖ్యాకముగ గలవు. 



జై శ్రీ గురు రాఘవేంద్ర

**** 

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము 

23 వ భాగము 

సమాప్తము **

💥🌸💥🌸💥🌸


🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్ర య నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat