శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 2 🌹

P Madhav Kumar


 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


నాస్ట్రోడామస్, నే ఉదాహరణగా తీసుకుంటే …. హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధి హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రోడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా? అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే, వీటిని ఎక్కువమంది నమ్ముతారు.


వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిందీ ఇలాంటివే! నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తునట్టే, రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే భవిష్యద్దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి.


వీరబ్రహ్మేంద్రస్వామి జ్యోస్యాలలో కొన్ని సూటిగా వుంటే, మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇకముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం ‘కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది.


కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా? లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఎదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగరబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు.


జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యంవల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat