#శ్రీ వేంకటేశ్వర లీలలు
🐚☀️ *
🌸 *పాపనాశ తీర్థము:*
పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణంలో చెప్పబడింది.
ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది. ఈ తీర్థం స్నానం వద్ద చేయుటవలన అత్యంత పుణ్యం లభిస్తుంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం.
🟢 *పాపనాశన తీర్థమునకు సంబంధించిన కథ:*
పూర్వకాలమున భద్రమతి అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేదములు చదువుకున్నవాడు. అతనికి ఆరుగురు భార్యలుండిరి. ఆ భార్యలయందు అందరికీ సంతానము కలిగెను. ఇంటిలో ఎక్కడ చూచిననూ యీ పిల్లల గుంపుతోనే నిండిపోయెను.
అతడు సాధారణమైన సంసారి. అతనికి వచ్చు ఆదాయము సంసారమునకు చాలక పోయెను. దరిద్రము మిక్కుటమయ్యేను. భార్యలు, పిల్లాలు భాధించుచుండిరి. దరిద్రబాధతో మృగ్గి ఆ బ్రాహ్మణుడు కృషించుచుండెను.
ఆ బ్రాహ్మణుని భార్యలలో యశోవతియను కాంత భర్త విచారము చూచి ఇట్లనెను. "నాధా! అన్ని దానములలో భూదానం చేయువారికి మహదైశ్వర్యములు లభించునందురు. వెంకటాచలమున గల పాపనాశ తీర్థములో స్నానమొనర్చి భూదానం చేసిన వారికి సమస్త భోగములు గల్గును. ఇహపర సుఖములు గల్గును. సకల పాపములు హరించును అని పూర్వము మా తండ్రికి నారదముని చెప్పగా విన్నాను. మీరు అట్లు చేయవలసినది" అని చెప్పెను.
ఆ బ్రాహ్మణుడు భార్య మాటలు విని వెంటనే సమీపమున నున్న ఒక అగ్రహారమునకు బోయి ఒక గృహస్థు వలన ఐదు చేతులు కొలత గల భూమిని తాను దానము పొంది అక్కడ నుండి వెంకటాచలం జేరి పాపనాశ తీర్థమున స్నానమాడి స్వామిని సేవించి తాను దానంగా సంపాదించిన ఐదుచేతులు పరిమితమైన భూమిని వేరొక బ్రాహ్మణునికి దానం ఇచ్చేను.
పాపనాశనం చేసిన భూదానమునకు భగవంతుడు ప్రత్యక్షమై సకలమైన భాగ్యములు ప్రసాదించెను.