#శ్రీ వేంకటేశ్వర లీలలు
🐚☀️ *
🌸 *ఆకాశ గంగ తీర్థము:*
ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన.
ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో ఆకాశ గంగ తీర్ధం ఉంది.
హిమచలంలో ప్రవహించిన గంగ మూడు పాయలయిoది. ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది.
ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.
మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం.
🟢 *ఆకాశ గంగ తీర్థమహిమకు సంబందించిన కథ:*
పూర్వము గోదావరి తీరములో ఒక అగ్రహారం కలదు. ఆ అగ్రహారమున ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేదములను చదివినవాడు. గొప్ప జ్ఞాని, సత్యవంతుడు, అతిథి పూజలు భక్తితో చేసేవాడు. భూతదయ కలవాడు. నిరతాగ్నిహోత్రము గలవాడు. అతని పేరు కేశవభట్టు.
ఒకనాడు కేశవభట్టు గృహమునకు మరొక బ్రాహ్మణుడు వచ్చెను. ఆ బ్రాహ్మణుడు కూడా చక్కగా వేదము చదివిన వాడు. ఆ రోజు కేశవభట్టు తండ్రి తద్దినము. అందువల్ల కేశవభట్టు ఆ వచ్చిన బ్రాహ్మణునే బ్రహ్మణార్థమునకు నియమించి శ్రాద్ధము పూర్తిగావించేను.
తరువాత కేశవభట్టునకు శరీరమంతా వికృతాకారము అయి క్రమముగా ముఖము గాడిద రూపము వచ్చెను. కేశవభట్టు దిగులుపడి సువర్ణముఖి నదీతీరం చేరి అచ్చట అగస్త్య మహాముని ఆశ్రయము చేరి అతనికి నమస్కరించి తన బాధ మనవి చేసుకొని అది పోవుమార్గము తెల్పుమని కోరెను.
అగస్త్యముని యోగదృష్టితో జూచి ఇట్లనెను. "బ్రాహ్మణుడా! నీకీ కర్మ వచ్చుటకు కారణమేమనగా మీ తండ్రి శ్రాద్ధము నాడు సంతానము లేని వానిని బ్రాహ్మణార్థముగా నియమించితివి గనుక నీకీ గాడిద ముఖము కల్గినది. కనుక నీవు శ్రీ వేంకటాచల క్షేత్రమునకు బోయి అందు పవిత్రమైన ఆకాశ గంగలో మునుగుము. నీకు గల్గిన యీ వికృత రూపము నశించును" అని చెప్పెను.
కేశవభట్టు వేంకటాచలమునకు జేరి ఆకాశ గంగలో మునిగి తన ఎప్పటి రూపమును పొందెను.