శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 58*

P Madhav Kumar

#శ్రీ వేంకటేశ్వర లీలలు

🐚☀️ *

🌸 *తుంబుర తీర్థము:*

తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.

తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబురతీర్థం. తుంబురుడి పేరుమీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికీ అక్కడ ఉన్నాయి.

కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబురతీర్థం ఏర్పడింది. ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు.

పూర్వం 'తుంబురుడు' అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్ధించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని వాళ్లు సెలవివ్వడంతో, అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడట. 'తుంబురుడు' మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి 'తుంబుర తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు, ఈ తీర్థానికి చేరుకుని అందులో స్నానమాచరిస్తుంటారు. 

🟢 *తుంబుర తీర్థ మహిమకు సంబందించిన కథ:*

పూర్వము తుంబురుడు అను గంధర్వుడు గలడు. అతడు మాఘ మాసము రాగానే ఆ నెల దినములూ ఆ తీర్థములో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని సేవింపదలచి భార్యతో కలిసి ఆ తీర్థమునకు వచ్చెను.

తుంబురుడు తన భార్యను చూచి ఇట్లనెను. "నీవు ప్రతి దినమూ నా కంటే ముందు తెల్లవారుజామున నిద్రలేచి ఈ తీర్థంలో స్నానమాడి నేను దేవతాపూజ చేసికొనుటకు ఆవు పేడతో పూజాస్థలమును శుద్ది చేసి మ్రుగ్గులు పెట్టి దీపారాధన గావించి శుచిగా సమస్త పాకములు స్వామి నివేదనకు సిద్దము చేసి నాతోబాటు స్వామి కైంకర్యములో పాల్గొని, హరినామస్మరణ మరువక చేస్తూ మంచి నిష్ఠతో ఉండవలసినది" అని ఆజ్ఞ ఇచ్చేను.

ఆ మాటలు విని అతని భార్య కోపము గల్గి భర్తతో ఇట్లనెను. "మాఘ మాసము చాలా చలిగా ఉండును. ఈ దినములలో చల్ల నీళ్ళ స్నానము చేసిన రొంప పట్టి రోగము వచ్చును. గాన, నా వల్ల కాదు" అని చెప్పెను.

తొంబురునకు ఆ మాట వినగానే అంతులేని కోపము వచ్చి పతిమాట తిరస్కరించు ఇల్లాలికి ప్రాయశ్చిత్తము చేయవలసిందేయని తలంచి కోపముతో "ఓసి! నీవు నా మాటకు ఎదురు చెప్పితివి గాన ఈ కొండపైన ఉన్న ఘోణ తీర్థము సమీపమున ఉన్న రావివృక్షము తొర్రలో కప్పవై పడిఉండు" మని శపించెను.

ఆ శాపము విని ఆమె భయపడి భర్త పాదములపై పడి తన తప్పుకు క్షమించి శాపము పోగొట్టుమని ప్రార్తింప తుంబురుడు దయ కలిగి ఇట్లనెను. "నీవు కప్ప రూపములో ఉన్నప్పుడు అగస్త్య మహాముని ఆ ఘోణ తీర్థమునకు వచ్చి అందు మునిగి శిష్యులకు ఆ ఘోణతీర్థ మహిమ చెప్పును. ఆ మహిమ నీవు విని శాపవిముక్తి నొందగలవు" అనెను.

తుంబురుని భార్య కప్ప అయి అనంతరము అగస్త్యుని వలన ఘోణతీర్థ మహిమ విని శాపవిమోచనం నొందను.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat