శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 64*

P Madhav Kumar

 #శ్రీ వేంకటేశ్వర లీలలు


🌸 *పాండవ తీర్థము / గోగర్భ తీర్ధం :


పాండవ తీర్థం తిరుమలలో ఉంది. దీనికే గోగర్భ తీర్థమనీ పేరుంది. వేంకటేశ్వరాలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం నివసించారని ఐతిహ్యం.


పాండవ తీర్ధం నీటిని ఒడిసి పట్టుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1963 లో గోగర్భ డ్యామ్ నిర్మించింది. 


వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశిరోజు, అదీ ఆదివారం అయితే, పాండవతీర్థంలో స్నానం చేయటంకానీ లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారం నాడు స్నానం చేయటంకానీ మంచిదని భక్తులు భావిస్తారు. ఆ రెండు రోజులూ స్నానం చేయటం సకల శ్రేష్ఠం.


తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో పాండవ తీర్ధంఉంది. ఈ తీర్థాములో స్నాన ఫలం వల్ల పాండవులకు సమర విజయం, రాజ్య ప్రాప్తి కలిగిందని వరహః పురాణం చెబుతుంది.

జ్ఞాతులయిన కౌరావులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్ధస్నానం వల్ల పోగొట్టుకోన్నారని పద్మపురాణం విశదికరిస్తుంది.


20 వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మ విద్యావ్యాపకుడుగా ప్రసిద్ధి వహించిన శ్రీ మలయాళ స్వాములవారు ఏర్పేడు ఆశ్రమం స్థాపించడానికి ముందు ఈ ప్రాంతంలోనే కఠనమయిన తపస్సు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు అనుమతించగా ఏర్పేడు వ్యాసాశ్రమం వారు అందమయిన భవన నిర్మాణం ఇక్కడ చేపట్టారు.


వృషభరాశిలో సూర్యుడు సంచరించే వేళా శుక్ల పక్షంలో గాని కృష్ణపక్షంలోగాని, ద్వాదశి తిదిలో ఆది, మంగళవారాలలో ఈ తీర్ధంలో స్నానం చేయడం పవిత్రమని, ప్రశస్తామని పెద్దలంటారు.


🟢 *పాండవ తీర్థ మహిమకు సంబందించిన కథ:* 


పూర్వం పాండవులకు, కౌరవులకు గొప్ప యుద్ధము జరిగెను. ఆ యుద్ధంలో పాండవులు శ్రీ కృష్ణుని సహాయము వలన భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాది కౌరవ బలమును సంహరించి స్వరాజ్యమును సంపాదించిరి.


ధర్మరాజునకు రాజ్యము వచ్చెనని సంతోషము లేదు. బంధువులను, గురువులను చంపుకొని మహాపాపము పొందితినని దుఃఖము పీడించుచుండెను.


ఒకనాడు ధర్మరాజు కృష్ణునితో "స్వామి! జగన్నాథ! వాసుదేవ! నేను రాజ్యలాభమునకై బంధు నాశము చేసి మహా పాపాత్ముడనైతిని. నా పాపమునకు విముక్తి మార్గము చెప్పి రక్షింపు"మని వేడుకొనెను.


కృష్ణుడు యోచించి ఇట్లనెను: "ధర్మరాజా! దిగులు పడవలదు. శ్రీ వేంకటాచలమున వేంకటేశ్వరుడు భక్త రక్షకుడై వెలసి యున్నాడు. ఆ స్వామి పుష్కరిణికి తూర్పు భాగమున ఒక తీర్థము ఉన్నది. ఆ తీర్థములో మీరు స్నానమొనర్చి శ్రీనివాసుని సేవించిన మహాపాపములు నశించి తరించేదరు" అని చెప్పెను.


ధర్మరాజు వాసుదేవుని మాటలు విని తమ్ములైన భీమ, అర్జున, నకుల, సహదేవులను, భార్యయగు ద్రౌపదిని వెంటబెట్టుకుని శ్రీ వెంకటాచలం జేరి ఆ తీర్థము నందు స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని సేవించి పాపవిముక్తులై రాజ్య పాలన చేసిరి. ఆ పాండవులు స్నానమాడినదే "పాండవ తీర్థము". 


🌸 *వైకుంఠ తీర్థము:* 


స్వామివారి కోవెలకు తూర్పు దిశలో 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పురజనులు అప్పుడప్పుడు ఇక్కడ వైకుంఠ సమారాధన చేస్తూ ఉంటారు.


పవిత్రమైన ఇక్కడి జలపాతానికి రామాయణ కాలం నాటితో సంబంధం ఉందని నమ్ముతారు. రాముడికి చెందిన వానరసేన ఈ తీర్థము వద్దే ఉండేది అని చెబుతారు. 


ఇక్కడి పవిత్ర జలములో మునక వేయడం ద్వారా అదృష్టం, మంచి భవిష్యత్తుతో పాటు పాపాలు తొలిగి పోతాయని భక్తులు విశ్వసిస్తారు.


🌸 *యుద్దగళ తీర్థము / రుద్రగళ తీర్థము:* 


ఈ తీర్థము గురించి రామాయణంలో కూడా వర్ణించ బడి ఉంది. పూర్వము రాముడు, రావణుని సంహరించిన తర్వాత తాను చేసిన బ్రహ్మ హత్య మహా పాతకాన్ని నిర్మూలించు కోవడము కోసం ఇందులో స్నానం చేశాడు.


యుద్దగళ తీర్థమును రుద్రగళ తీర్థము అని కూడా అంటారు. ఇది తిరుమల ఆలయము నుండి ఉత్తర దిశలో సుమారు 30 కిలో మీటర్ల దట్టమైన అడవిలో మొగిలిపెంట సమీపమున ఉంది. 


పర్వత పరివేష్టిత దుర్గమరణ్య మార్గంలో ప్రయాస భరిత ప్రయానాంతరం ఈ తీర్థంలో స్నానం చేస్తే త్రుటిలో ప్రయాణ అలసట తీరుతుంది.


రుద్రగళ తీర్థములో కార్తీక పౌర్ణమినాడు స్నానం చేసి రుద్రుని లేదా ఇష్ట దేవతను పూజించి రాత్రి అక్కడ నిద్రిస్తే కలలో యుద్ద దృశ్యాలు కనబడుతాయట. రుద్రుని ఢమరుక ధ్వనులు, దేవదూతల శబ్ద గోసలు వినిపిస్తాయి.


పక్కనే ఉన్న రాతి బండమీద యుద్ద దృశ్య చిత్రాలు, చరిత్ర మరియు ఆదిమానవుని నాటి రాతి పనిముట్లు చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రదేశం పూర్వపు చరిత్రకు తార్కాణం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat