శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 65*

P Madhav Kumar

 #శ్రీ వేంకటేశ్వర లీలలు


🌸 *కపిల తీర్థం:* 


శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. 


కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది.


ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తిక మాసం లో వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ, బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.


తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.


ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు. 


కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. 


🟢 *కపిల తీర్థ మహిమకు సంబందించిన కథ:*


పూర్వం పురందరుడు అను రాజు ఉండెను. ఆ రాజు మంచి ధర్మ గుణం కలవాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించుచూ ఎన్నేనియో యేండ్లు రాజ్యమేలెను.


ఆ మహారాజుకు ముసలితనం కూడా వచ్చెను. కానీ సంతానం కలుగలేదు. అందువలన అనేక దినములు చింతపడి భగవంతుని గూర్చి ప్రార్థించెను. తరువాత కొంత కాలమునకు కుమారుడు పుట్టెను. వానికి మాధవుడు అను పేరు బెట్టి గారాబంగా పెంచుకొనేను.


మాధవుడు పెరిగి పెద్దవాడైనాడు. తండ్రి మాధవునకు పాండ్యదేశ రాజకుమార్తెయైన సుశీలను పెండ్లి చేసెను. సుశీల ఉత్తమ ఇల్లాలు. చాలా బుద్ధిమంతురాలు. వేద ధర్మములు బాగా తెలిసినది.


ఒకనాడు మాధవుడు భార్యను చూచి ఇట్లనెను. "ప్రియురాలా! నాకు ఇప్పుడు నీపై భ్రాంతి కల్గినది. వెంటనే నా ప్రేమదీర్చు" అని అడిగెను.


ఆ మాటలు విని సుశీల "నాధా! ఇది ధర్మముగాదు. పగటివేళ పశు పక్షి మృగములు సంగమించ వచ్చు గాని, మానవులు కలియరాదు. అది మహాపాపము" అని అనేక విధముల ప్రార్థించెను.


మాధవుడు భార్య మాటలకు ఎదురు చెప్పలేక వెంటనే అరణ్య మార్గమున బోవుచుండెను. ఒక చెట్టు నీడను చక్కని చుక్కయైన కాంతను చూచెను. మాధవునకు ఆమెపై ప్రేమగల్గి దగ్గర జేరి "కాంతా! నీవేవరవు? నీ పేరేమి?" అని అడిగెను.


మాధవుని మాటలు విని ఆ సుందరాంగి "అయ్యా! నా పేరు కుంతల. నాది విశాల నగరము. నా తల్లి చంద్రారేఖ. నేను వేశ్యను. కారణనతరమున ఇక్కడికి వచ్చితిని" అనెను.


ఆ మాటలు విని మాధవుడు "కల్యాణి! నిన్ను చూసినప్పటి నుండి నాకు నీపై మోహము కల్గినది. నేను నిన్ను భార్యగా చేసుకొందును" అనెను.


ఆ మాటలు విని కుంతల "అయ్యా! నేనొక నీచురాలను. నీవు మంచి కులమున బట్టిన వాడవువలే కనిపించుచున్నావు. నాతో స్నేహము మహాపాపము. నీ దారినిబొమ్ము" అనెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat