శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

P Madhav Kumar

శరన్నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.🍀

🌻హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం

వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం

తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్


🌻బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు కథలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆరాదించి పూజించే సంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది.


🌻అమ్మవారి రూపాల్లో బాలా త్రిపురసుందరి అలంకారం విశేషంగా చెప్పబడింది. బాల అంటే చిన్నపిల్ల అని అర్థం. అమ్మవారు మొదట మన ఇంటికీ చిన్నపిల్ల రూపంలో వస్తుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు అమ్మవారి బాలాత్రిపురసుందరి ప్రతిరూపాలే. ఈ రోజున అమ్మను కొలిచి ఆమెను ధ్యానిస్తే మన సంతానం ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. నిర్మలమైన మనస్సుకు నిత్య సంతోషానికి గుర్తులు చిన్నపిల్లలు. 


🌻అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన మొది ఆరాధన అవుతుంది.


🌻ఎవరైన ఏ మంత్రాన్నైనా ఉపాసించాలనుకునేవారికి మొదటగా ఇచ్చే మంత్రం బాలా మంత్రం. ఈ బాల మంత్రం తరువాతనే మిగతా మంత్రాలు ఉపాసనకు ఇస్తారు. ఇక్కడ పూజ చేసే చిన్న పిల్లలు అందరూ 2 సం||లు పై బడిన వారి నుంచి 10 సం||ల లోపు వారు మాత్రమే అయి ఉండాలి. 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat