తిరుమల శ్రీవారి శుక్రవారాభిషేకం....
@ శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టు కి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:00 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం.
1. పునుగు
2. కస్తూరి
3. జవ్వాది మున్నగు
సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకాశగంగా తీర్థంతో సుమారు ఒక గంట పాటు అభిషేకం జరుగుతుంది
తిరుమలలోని మూలవిరాట్టుకు నిత్యభిషేకం లేదు.
నిత్యాభిషేకం భోగశ్రీనివాసమూర్తికి కే . మూలవిరాట్టుకి శుక్రవారం మాత్రం అభిషేకం.
ప్రాతఃకాల ఆరాధన పూర్తికాగానే అభిషేకం సంకల్పం జరుగుతుంది. అస్తోత్తర శతానామఅర్చన జరుగుతుంది. ఆఫై ఊర్ధ్వపుండ్రంలోని అరభాగం కుడా తగ్గించి సుక్ష్మంగా ఊర్ధ్వ పుండ్రాన్ని మాత్రం దర్సనియమాత్రంగా ఉంచుతారు.
వస్త్రాన్ని,ఉత్తరేయాన్ని తొలగించి స్నానకౌపీనం కడతారు.
ఈ సమయంలో శ్రీవారి సన్నిధానంలో రెండు వెండి గంగాళలలో గోక్షిరాన్ని,రెండు వెండి గంగాళాలలో బంగారుబావి శుద్దోదకాన్ని సిద్దపరుస్తారు.
ఆ తరువాత జియ్యంగార్ర్లు, అధికార్లు, ఏకాంగులు, పరిచారకులు, ఆచార్య పురుషులు , వైస్తవస్వాములు, పరిమళంఅరకు వెళ్ళతారు.జియ్యంగార్లు పచ్చ కర్పూరం,కస్తూరి ఉన్న రజతపాత్రను అధికారులు కుంకుమపువ్వుతో తయారు చేసిన నలుగు బిళ్ళలు,చందన బిళ్ళలు,పసుపు కలిపి ఉన్న రజత పాత్రలను, పరిచారకులు పరిమళం ఉన్న రజత పాత్రలను స్వీకరిస్తారు.
ఈ సేవకు డబ్బు కట్టినవారు,ఈ సేవకు అనుగుణంగా గంబురా(పచ్చకర్పూరం) పాత్రలను, జాఫ్ర(కుంకుమ) పాత్రలను,కొందరు పునుగు పాత్రలను , కొందరు కస్తూరి పాత్రలను తీసుకొని విమాన ప్రదక్షణం చేసి బంగారు వాకిలి చేరుకొంటారు. అభిషేక ద్రవ్యాలను శ్రీవారికి సమర్పిస్తారు. ఆఫై అభిషేకం మొదలవ్తుంది.
@ అర్చకుడు అభిషేకానికి అనువుయిన పిఠo మీద నిలబడి జియ్యంగార్ అందించిన ఆకాశగంగా జలంతో నిండిన సువర్ణ శoఖo తీసుకోని పురుష సుక్తంతో అభిషేకం కొనసాగిస్తాడు.
అభిషేకనంతరం వరకు పంచ సుక్తాల పంచోపనిషత్తుల పఠనం కొనసాగుతుంటుంది. సువర్ణ శoఖాభిషేకం పూర్తి అయ్యాక క్షీరాభిషేకం మొదలవ్తుంది.
శ్రీవారి వైకుంఠహస్త్తం నుండి జాలువారే క్షిరాన్ని సంగ్రహిస్తారు.
ఆఫై శుద్దోదకాభిషేకం సాగుతుంది. కేసరి బిళ్ళలు.చందన బిళ్ళలను శ్రీవారి శ్రీహస్తానికి సమర్పిస్తారు.
ఆ తరువాత కార్యక్రమం ఉద్వఅర్తనం పరిమళ పాత్రలలోని పరిమళాన్ని ఆపాద కిరీటం పూసి నలగిడి శుద్దోదకాభిషేకం ప్రారంబిస్తారు.
వైకుంఠహస్తం నుండి జాలువారే అభిషేకోదకాన్ని సంగ్రహించి భక్తులకు వినియోగిస్తారు.
తదనంతరం శ్రీలక్ష్మిహరిద్రాభిషేకం శ్రీవారి వ్రక్షఃస్టలంలోని అమ్మవారికి ఈ అభిషేకం జరుగుతుంది.
తదనంతరం శుద్దోదకాభిషేకం.108 కలశాల జలంతో అభిషేకం పూర్తిచేస్తారు.అప్పుడు తెరలో మూల విరాట్టు శరీరంఫై తడి లేకుండా తుడిచి,శ్రీవారికిరీటానికి పొడి వస్త్రం చుట్టి 24 మూరల పొడవుగల సరిగ పట్టంచు దోవతిని,12 మూరల ఉత్తరియాన్ని అందంగా తొడగి ఆఫై ఉర్ద్వ పుండ్రాన్ని తీరుస్తారు. పచ్చకర్పూర హారతి జరుగుతుండగా తెరను తీస్తారు...
శుక్రవార అభిషేక అనంతరం మిల మిల మెరిసిపోతున్న శ్రీవారిని చూసి భక్తులు పరవశించి పునీతులవుతారు...
అభిషేకప్రియ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా..
ఓం నమో వెంకటేశాయ.
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️