దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు గురువారం మాత్రమే దక్కుతుంది.
సడలింపు:
గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.
ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా స్వామి నిరాడంబర స్వరూపంతో దర్శనమిస్తారు.
గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని అంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డ (పరివీటం, పరివేష్ఠనం) తో నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు స్వామి.
మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలో నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తారు. భక్తుల్లో కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారికి గోచరిస్తారు.
గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు.
తిరుప్పావడ..
తమిళంలో తిరు అనేమాటకు మంగళం అనే అర్ధం.పావడ అంటే వండిన ధాన్యరాశిని అర్పించడం
బంగారు వాకిలికి ఎదురుగా సుమారు ఆరు మూటలు- 450 కిలోల బియాన్ని పులిహోరలాగా వండి శ్రీనివాసునికి వివేదిస్తారు.శ్రీవారి దృష్టి ప్రసారం కలేగేటట్లు అన్నరాశిని కొన్ని భాగాలుగా చేస్తారు. ఫై భాగంలో పెద్ద అన్నకుటాన్ని ఎనిమిది దిక్కులలో ఎనిమిది శిఖరాలను తలపించే విధంగా చేస్తారు. శ్రీవారి సన్నిధిలో ప్రసిద్దమయిన లడ్డు ప్రసాదాలు,వడ ప్రసాదాలు ,అప్పం, దోస, జిలేబి, పాయసం ప్రసాదాలను శ్రీవారికి కనిపించేలాగున సమికరిస్తారు.ఆ తరువాత మహాఘంటల నుండి ప్రణవనాదం సమర్పణ చేస్తారు.శ్రీ భాష్యకారుల వారికీకూడా నివేదన జరుగుతుంది.
పూలంగి సేవ
తమిళంలోని పూఆoడై అనడానికి సరియయిన తెలుగు పదం పూలాంగి.గురువారం సాయంత్రం వేళా శ్రీవారికి జరిగే ప్రత్యేకమైన సేవ పూలంగి సేవ.
స్వామివారికి వేటగౌను తొడగడం,పుష్పాలంకరణ చేయడం, కత్తిఅయన ముందుంచడం మొదలయినవి ఈ సేవలోని ప్రతేక అంశాలు.ఈ సందర్బ్బంలో అర్పించే కత్తి సూర్యకఠారి.
దశరధనందన గోవిందా || దశముఖమర్ధన గోవిందా
పక్షివాహనా గోవిందా || పాండవప్రియ గోవిందా
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా..
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️గురువారం -తిరుప్పావడ సేవ👆
ఓం నమో వేంకటేశాయ ...🙏