🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నసందర్భంగామణిద్వీపములో చింతామణి గృహంలో కామేశ్వరీ, కామేశ్వరులిరువురు ఆనంద పరవశులైవున్న సమయంలో సకల దేవగణ, ఋషిగణ, యోగినీ గణాదులు మహాకామేశ్వరుణ్ణి ప్రార్జించి, స్వామి!
🌿మిమ్ములను పగటికాలమందు అమ్మను రాత్రికాలమందు ఆరాధిసూ తరిస్తున్నాము. ఒక్క రాత్రికాలమందైనా తమరిని ఆరాధించాలనేటటువంటి కోరిక కలుగుతోంది అనుగ్రహించండి స్వామీ! అని వేడుకున్నారు.
🌸భక్తవశంకరుడైన మహాకామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్ధశినాటి రాత్రికాలము మీకు అనుగ్రహిస్తున్నానని వరప్రదానం చేశాడు. ప్రక్కనే వున్న మహాకామేశ్వరీ అయిన మహాత్రిపుర సుందరి నా స్వామి నన్ను నిర్లక్ష్యంచేసి,
🌿నా అనుమతిలేకనే నా కాలమైన రాత్రికాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి, నన్నవమానించాడు. అవమానానికి తట్టుకోలేని మహా కామేశ్వరి మహాకాళీ రూపాన్ని దాల్చి,
🌸అనంతవిశ్వాన్ని బ్రిమింగేస్తానని చెప్పి శపథాలు చేసూ, ఉగ్రరూపిణియై, బిల్వవృక్షాన్ని ఎక్కి కూర్చొని వికటాట్టహాసాలు చేస్తోంది.
🌿అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. సర్వగణాలు మహాకామేశ్వరునివద్దకు పోయి స్వామీ! ఏమిటీ లీల! మేము మా ఆనందం కోసం మిమ్మల్ని రాత్రికాలంలో ఆరాధించాలని అడిగామనుకోండి.
🌸తమరు ప్రక్కనే వున్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏవిధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు. అమ్మవారికెందుకంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని మీరే అనుగ్రహించాలని వేడుకొన్నారు.
🌿చిరునవ్వులు చిందిస్తూ మహా కామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతోశాంతింపచేయమనిఆదేశించాడు. వారు ఆరుపగళు, ఆరురాత్రు ళ్ళుఅమ్మవారియొక్కఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహా కామేశ్వరుణ్ణి ఆశ్రయించారు.
🌸మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల మూడు రాత్రుళు, మూడు పగళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపం వృద్ధి అవుతోందే కానీ, తగ్గుముఖం పట్టలేదు.
🌿మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రికాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశమిచ్చినందులకు గాను ఈ తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు నీయొక్క ఆరాధనకే అవకాశమిస్తున్నాను.
🌸శాంతించి బిల్వవృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు. అప్పడు ఉగ్రకాళీ రూపాన్ని ఉప సంహరించుకొని కామేశ్వరిగా, మహాకామేశ్వరుణ్ణి చేరింది.
🌿ఈ నవరాత్రులలో అమ్మకు ప్రియమైన, అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ పుష్పాదులతో, సాంబ్రాణి ఉగ్గులను, అగరు ధూపాలతోఅమ్మవారినిసేవించిన సంపూర్ణ ఆయురారోగ్యములు వృద్ధి చెందును.🙏