తిరుపతి గోవిందరాజ స్వామి రాతి విగ్రహం ఎక్కడ…?

P Madhav Kumar


Part -28

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

తిరుపతి గోవిందరాజ స్వామి రాతి విగ్రహం ఎక్కడ…?


తిరుమల శ్రీనివాసునికి అన్నగారైన గోవింద రాజస్వామి తిరుపతి వైభవాన్ని మరింత పెంచాడు. ఒకప్పుడు చిదంబరంలో ఉండే గోవింద రాజస్వామి రామానుజాచార్యుల చొరవతో తిరుపతికి తరలివచ్చారు. అయితే ఇప్పుడు గోవింద రాజస్వామి ఆలయంలో మనం చూస్తున్న విగ్రహం సుద్దతో చేసిన విగ్రహం. సాధారణంగా ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కూడా తొలుత రాతి విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని చేయించారు. కానీ సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రాతి విగ్రహం ఏమైంది… సుద్ద విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించాల్సి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.


చిదంబరంలో నటరాజ స్వామితో సమానంగా పూజలు అందుకుంటున్న గోవిందరాజ స్వామిని కుళోత్తుంగ చోళుడు స్థాన భ్రష్ఠం చేసి సముద్రం పాలు చేశాడు. అదే సమయంలో కొందరు భక్తులు గోవింద రాజస్వామి ఉత్సవ మూర్తిని తీసుకుని తిరుపతి వచ్చారు. అప్పుడు రామానుజాచార్యుల వారు కూడా తిరుపతిలోనే ఉండేవారు. స్వామి వారి పరిస్థితిని తెలుసుకున్న రామానుజులు… తిరుపతిలోనే గోవింద రాజస్వామి ఆలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికి నాటి యాదవ రాజు సహకారం లభించింది. అద్భుతమైన నగరంగా గోవింద రాజస్వామి ఆలయం రూపు దిద్దుకుంది.


విగ్రహం కథ ఇక్కడే మొదలైంది


గోవింద రాజస్వామిని ప్రతిష్టించాలనే ఉద్దేశంతో శిల్పుల చేత ఓ విగ్రహాన్ని చెక్కించారు. అయితే అందులో కొన్ని లోపాను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రామానుజుల వారు దేశ పర్యటనకు వెళ్ళాల్సి రావడం వల్ల సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించి వెళ్లారు. నాటి నుంచి నేటి వరకూ సుద్ద విగ్రహమే గోవింద రాజస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుంది. అందుకే ఇక్కడ స్వామికి అభిషేకాలు ఉండవు. నూనెను మాత్రమే పూస్తారు.


రాతి విగ్రహం ఏమైంది..?


తిరుపతిలో మంచినీటి కుంటగా పిలిచే నృసింహ తీర్థం వద్ద గోవింద రాజస్వామి రాతి విగ్రహాన్ని ఉంచారు. నాటి నుంచి నేటి వరకూ ఆలనా పాలనా లేక ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మీరు కూడా చూడాలనుకుంటే… తిరుపతి రామచంద్ర పుష్కరిణి ఎదురుగా ఉండే మంచి నీటి కుంట వద్ద చూడవచ్చు. గత చరిత్రకు దర్పణంగా నిలిచే ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అలా పూజలు అందుకోవలసిన గోవింద రాజ స్వామి… చిన్న లోపాల కారణంగా ఆరు బయటే కొలువ తీరాల్సి వచ్చింది. సుద్దతో చేసిన స్వామి ఆలయంలో వైభవోపేతంగా వెలిగిపోతున్నారు.


ఓం నమో వేంకటేశాయ


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat