శుక ఉవాచ.....
తతః సావిస్మితముఖీ పద్మా నిజజనైర్వ్భతా
హరిం పతిం చింతయంతీ ప్రోవాచ విమలాం స్థితామ్.
పద్మోవాచ........
విమలే! కింకృతం ధాత్రా లలాటే లేఖనం మమ
దర్శనాదపి లోకానాం పుంసాం శ్రీభావకారకమ్.
🌺అర్ధం:
శుకము పలికెను. పిమ్మట పద్మావతి విస్త్మతముఖియై హరిని ధ్యానించుచు విమలయను సఖురాలితో ఇట్లు పలికెను. ఓ విమట! విధాత నాభాగ్యము గూర్చి ఎట్లు వ్రాసినో గదా! నన్ను కామభావముతో చూచి పురుషులు స్త్రీరూపమును పొందుచున్నారు.
మమాసి మందభాగ్యాయాః పాపిన్యాః శివసేవనమ్
విఫలత్వమను ప్రాప్తం బీజముప్తం యజ్ఞోషం.
హరిర్లక్ష్మీపతిః సర్వజగతామధిపః ప్రభుః
మత్కృతే...స్యభిలాషం కిం కరిష్యతి జగత్పతిః
🌺అర్ధం:
నేను మిక్కిలి దురదృష్టవంతురాలను, పాపాత్మురాలను మరుభూమియందు నాటిన బీజమువలె నా శివసేవనము నిష్ఫలమాయెను. సర్వజగద్రక్షకుడు, వృద్ధిబొందువాడు, లక్ష్మీపతి యగు హరినాయెదలకో రైక గలవారుగునా? నన్ను అభిలాషించునందునా?
యది శంభోర్వచో మిథ్యా యది విష్ణుర్న మాం స్మరేత్
తదాహమనలే దేహం త్వక్ష్యామి హరిభావతా.
క్వదాహం మానుషి దినా క్వాస్తే దేవో జనార్ధనః
నిగృహీతా విధాత్రాహం శిపిన పరివంచితా
🌺అర్ధం:
పరమేశ్వరుని వచనము అసత్యములైనను శ్రీహరి నన్ను స్మరించకపోయినను నేను హరినామస్మరణచేయుచు అగ్నిగుండమున దేహత్యాగము చేయగలను. నేను ఎక్కడ ? ఆది దేవుడు విష్ణుమూర్తి ఎక్కడ ? మాయిద్దరికి వివాహము ఎట్లు సంభవము ? విధాతచే తిరస్కరింపబడిన నేను పరమేశ్వరునిచే వంచింపబడితిని.
విష్ణునా చ పరిత్యక్తా మదన్కాకాత్ర జీవతి
ఇది నానా విలాపీన్యా వచనం శోచనాశ్రయమ్.
పద్మాయాళ్చారుచేస్తాయాః శ్రుత్వా యాతస్తవాంతో.
శుకస్యవచనం శ్రుత్వా కల్కి.! పరమవిస్మితః
తం జగాద పునర్యాహి పద్యాం బోధయితుం ప్రియామ్.
🌺అర్ధం:
విష్ణుమూర్తిచే విడువబడి స్త్రీ ఎలా జీవించి యుండగలదు ? నేను తప్ప ! నేను ఇంకను జీవించి యుంటిని అవి సచ్చరిత అయిన పద్మావతి విలాసములను విని నేను మీదగ్గరకు వచ్చితినని శుకము పలుకగ విని ఆశ్చర్యచకితుడైన కల్కి శుకముతో పద్మను అనునయించుటకు తిరిగి వెళ్ళు మని పలికెను.
మత్సందేశహరో భూత్వా మద్రూపగుణకీర్తనమ్
శ్రావయిత్వా పునః కీరః సమాయాస్యసి బాంధవః
సామే ప్రియా పతిరహం తస్యా దైవవినిర్మితః
మధ్యస్థేన త్వయా యోగమావయోశ్చ భవిష్యతి.
🌺అర్ధం:
ప్రియ బంధువగు శుకము! నీవు మా సందేశమును చేర్చువాడపై పద్మావతికి వినిపించి తిరిగి రావలసినది. పద్మ నాకు ప్రియురాలు. నేను ఆమెకు భర్తను. ఇది దైవ నిర్ణయము. నీవు మధ్యస్థుడవై మమ్ములను కలుపవలేను అని కల్కి పల్కెను.