మురిపాల గోపాల రారా కృష్ణా||
శ్రీ గురువాయురప్పా ఇటు రారా కృష్ణా||
చరణం1:
మురిపించ శిఖిపించ రారా కృష్ణా||
నీ ముద్దు మోము మాకు చూప రారా కృష్ణా||
మురిపాల
చరణం2:
నవమోహన భువనావన రారా కృష్ణా
నవనీతము ఆరగించ రారా కృష్ణా||
అటు దాగక ఇటు దాగక రారా కృష్ణా
యశోదమ్మ నిను పిలిచే రారా కృష్ణా||
ఘలు ఘల్లను గజ్జలతో రారా కృష్ణా
దోబూచులు చాలించి రారా కృష్ణా
నీ నటనలు నీ ఘటనలు చాలురా కృష్ణా
బుడిబుడి చిరు నడకలతో రారా కృష్ణా
కృష్ణా..కృష్ణా...కృష్ణా...కృష్ణా..!
గోపెమ్మల గోపయ్యగ రారా కృష్ణా
గోవర్థన గిరిధారి రారా కృష్ణా
మురిపాల
కృష్ణా..కృష్ణా...కృష్ణా...కృష్ణా..!