వరాహస్వామి ఆలయం - తిరుమల

P Madhav Kumar


Part - 29

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

శ్రీమహావిష్ణువు  మూడవ అవతారమైన వరాహస్వామి ఆలయాలు మనదేశంలో పలుచోట్ల వున్నాయి. వాటిలో ప్రముఖమైన దివ్యదేశము

తిరుమల పుణ్యక్షేత్రము.


ఆదిన  తిరుమల వరాహస్వామి ఆలయంగానే

వుండేది. అక్కడవున్న

పుష్కరిణికి స్వామి పుష్కరిణి అని పేరు.

పుష్కరిణి ఒడ్డున

వరాహస్వామి వారి ఆలయం. ఈనాటికి ప్రధమ పూజలు సమర్పించేది వరాహస్వామివారికే.

పద్మపురాణంలో ఈ ఆలయం  తిరుమల

వరాహస్వామి ఆలయంగానే 

వివరించబడినది.


ఏడుకొండలపై స్వామి

పుష్కరిణిలో ఆశ్వీయుజ

మాసంలో శ్రవణా నక్షత్రం రోజున వరాహస్వామి వెలసి 

తిరుమల వరాహ స్ధలమైనట్లు పద్మపురాణం

వివరించింది. 


ఇక్కడ  శ్రీనివాసునికి

ప్రత్యేక పూజలు జరుగుతాయి.

కారణం, ఒకే పుణ్యక్షేత్రంలో

 రెండు మహావిష్ణువు అంశలకు ముఖ్య పూజలు జరపడం

ఉచితం కాదని (వరాహస్వామి ప్రధమంగా

ఇక్కడ వెలసినప్పటికి) శ్రీనివాసునికే బలిపీఠ పూజ, హోమం, బ్రహ్మోత్సవాలు

మొదలైనవి జరపాలని 

రామానుజాచార్యుల

వారు మంగళాశాసనం చేశారు.

అయినా శ్రీ నివాసునికి

పూజలు జరపడానికి ముందే

వరాహస్వామికి పూజలు

జరుగుతాయి. తీర్థయాత్రలకి వచ్చిన వారు ప్రధమంగా వరాహ తీర్ధం లో స్నానం చేసి  వరాహస్వామిని దర్శించిన పిమ్మటే వెంకటేశ్వరస్వామి ని

దర్శించాలని మంగళా శాసనం చేశారు.


భవిష్యోత్తర పురాణంలో

శ్రీనివాసుడు  తనకు నివసించడానికి చోటు యిమ్మని వరాహస్వామిని

వేడుకోగా శ్రీ నివాసునికి

వరాహస్వామి ఆయనకు ఇప్పుడున్న స్ధలం యిచ్చినట్లు వర్ణించబడింది. 

శ్రీనివాసుడు వరాహస్వామిని యిలా అడిగాడు. " స్వామీ ..యీ

కొండ మీద మిమ్మల్ని చూసే భాగ్యం కలిగినది.

నాకు ఇక్కడ నివసించాలనే

కోరిక కలిగినది. కలియుగం

ముగిసేదాకా నాకు నివసించడానికి చోటు యివ్వండి." అని విన్నవించుకున్నాడు.

దానికి వరాహస్వామి

 " నేను ఇచ్చే

స్ధలానికి తగిన వెలను యిచ్చి

నివసించవచ్చును." అని అనగా,  అది విని శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చే భక్తులందరూ నన్ను

చూడడానికి  ముందే తమరిని దర్శిస్తారు.

పాల తిరుమంజనం, నైవేద్యం మొ.

మీకే జరుగుతాయి. ఈ విధంగా మీకు ప్రాముఖ్యత యివ్వడమే సరసమైన ధరగా భావిస్తున్నాను"

అని చెప్పగా  వరాహస్వామి

శ్రీ నివాసునికి వంద అడుగుల స్ధలాన్ని   యిచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.


శ్రీమద్రామానుజా

చార్యులవారు

వరాహస్వామికి ఒక ఉత్సవమూర్తిని తయారు చేయించి ప్రతిష్టించారు.

ఆ మూర్తికే అధ్యయన ఉత్సవం, వరాహ జయంతి ఉత్సవాలు జరిపారు.

తిరుమలలో వరాహస్వామి వెలసిన ఆశ్వీయుజ శ్రవణా

నక్షత్రం రోజున ఘనవైభవంగా

ఉత్సవం జరిపారు.

ఈనాటికి  ఆ ఉత్సవాలు  తిరుమలలో ఘన

వైభవంగా జరుగుతున్నాయి.

యాత్రీకులంతా ముందుగా వరాహస్వామిని దర్శించిన

పిదప ఏడుకొండలవాడిని

దర్శించాలి. అప్పుడే వారి పూజలు

ప్రార్ధనలు,యాత్ర  సంపూర్ణమౌతాయి...


వరాహ స్వామి వారి దగ్గర శ్రీనివాసుడు హామీ పత్రం రాసి ఇచ్చి మరీ.. అప్పుగా తీసుకున్న స్థలం వంద అడుగులు....


ఆయన తీసుకున్నది కేవలం తను నివాసంగా ఉండడానికి మాత్రమే, అంటే తన నివాసానికి ఆనంద నిలయ విమానం, అంగ ప్రదక్షిణ మార్గం పరిధి వరకు మాత్రమే అని భగవంతుని ఉద్దేశం కానీ క్రమక్రమంగా స్వామి తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోయి ఇప్పుడు దాదాపు కొండ మొత్తం శ్రీనివాసుడు ఆక్రమించుకున్నాడు( కబ్జా) అన్నట్టుగా చెలామణీ లోకి వచ్చేసింది.


 భవిష్యోత్తర పురాణం, వేంకటాచల మహత్యం ప్రకారం శ్రీనివాసుడు ఆ వంద అడుగుల స్టలం అడిగింది తొండమాన్ చక్రవర్తి చేత  తన కోసం ఒక నివాస యోగ్యమైన  ఆనంద నిలయ విమాన నిర్మాణం కోసం మాత్రమే.

 

 మిగతా గోపురాలు, ఇప్పుడు చూస్తున్న మిగతా ప్రాకారాలు, మండపాలు ,మహాద్వార గోపురం మొదలైన నిర్మాణాలు తర్వాతి కాలంలో పల్లవ రాణి సామవై, సాల్వ నరసింహ రాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవ రాయలు ,వేంకటపతి రాయలు, తిరుమల రాయలు... మొదలైన వారు నిర్మించి ఇచ్చినవే కానీ స్వామి తనకు తానుగా 100 అడుగులలో నివాసంగా ఏర్పాటు చేసుకున్నది కేవలం ఆనందనిలయం మాత్రమే....


శ్రీనివాసుడు నేరుగా వరాహ స్వామి వారికి రాసి ఇచ్చిన హామీ పత్రంలో పేర్కొన్నట్టుగా స్వామి తనకు తన నివాసంలో జరిగే ప్రతి పూజ, నైవేద్యం ,దర్శనం..తనకంటే ముందుగా శ్రీ ఆదివరాహ స్వామి వారికి  ముందుగా కైంకర్యం చేసిన తర్వాతే తనకు చేసే విధంగా హామీ పత్రం లో స్పష్టంగా హామీ ఇచ్చి ఉన్నాడు.


 అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి ఈనాటికీ ఆనందనిలయంలో నివేదింపబడు ప్రసాదం, ప్రథమ పూజ, స్వామివారి దర్శనం ఈ మూడు ముందుగా ఆది వరాహస్వామివారికి నివేదించ బడుతుంది .


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat