శ్రీ యోగనృసింహ స్వామి వారు -తిరుమల

P Madhav Kumar


Part -30

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించే భక్తులు మొదటి ప్రకార మండపంలో ఈశాన్య దిక్కున కొలువై వున్న శ్రీ యోగా నృసింహ మూర్తి (మూడు అడుగుల విగ్రహం) ని  దర్శించుకోవచ్చు.


విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి సన్నిధి దాటి ముందుకు వెళుతుండగానే యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆలయంలో స్వామి వారు పడమర వైపు తిరిగి వెంకటేశ్వరస్వామి వారిని చూస్తున్నట్లు ఉంటుంది.


రామానుజ ఆచార్యుల కాలం నాటికి తిరుమల ఆలయంలో యోగా నరసింహ ఆలయం లేదు. వైష్ణవులకు అన్ని అవతారాలకూ ప్రాధాన్యం సమానమే ఐనా, నరసింహ స్వామికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి అహోబలం 108 దివ్య తిరుపతులలో ఒకటి కావడం, నరసింహుని 32 రకాల మూర్తులలో యోగా నరసింహ మూర్తి కావడం, వైష్ణవ ఉపాసకులకు ‘నారసింహమంత్రం’ ముఖ్యం కావడంతో రామానుజ ఆచార్యులు ఆళ్వారుల స్తోత్రాలకు పాత్రుడై స్యామిపుష్కరిణికి పశ్చిమంలో పూజాదులకు నోచుకోని యోగనారసింహ (గిరిజ నృసింహ) మూర్తిని తిరుమల ప్రధాన ఆలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఈశాన్య మూలన పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠచేశారు. తరువాతి కాలంలో ఈ మూర్తికి ముఖ మండపం, అంతరాళం చుట్టూ ప్రదక్షిణమార్గాలు ఏర్పడడంతో సర్వజనులకు ఈ ఆలయం సేవ్యమానమైంది.


రామానుజుల కాలంనాడు ఈ యోగా నృసింహ స్వామికి పూజలు ఎలాటివి మరియు అవి ఏలా జరిగేవో తెలియదుగాని ప్రస్తుతం ఎల్లపుడూ నిత్యపూజలు లేకున్నా శుక్రవారంనాడు అభిషేకం, పూజాదికాలు జరుగుతున్నధి, మరియు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో నృసింహ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రామానుజుల కాలంనాటికి ప్రతి వైష్ణవాలయంలో ‘దివ్యప్రబంధ పారాయణం’ నియమం. ఆ కారణంవల్ల ఈనాడు కూడా యోగనారసింహ ఆలయంలోనూ ‘తిరుప్పల్లాండు’ ఆదిగా పారాయణం జరుగుతున్నది.

శ్రీ రామానుజ ఆచార్యులు యోగ నృసింహ ప్రతిష్ట చేయడమే కాకుండా, తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను క్రమబద్ధీకరించిన వ్యక్తి.


ప్రతి శనివారం తిరుమంజనం (దివ్యాభిషేకం) నిర్వహిస్తారు. అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశిన నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధపారాయణలు ఇక్కడ స్వామి దగ్గర చేస్తారు.ఈ స్వామికి ఉత్సవ విగ్రహం లేదు. కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్రం ఈ యోగ నరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు.



ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటిక కాంతిగల శరీరంతో ఉంటాడని చెప్పింది. ఈ స్వామి వారిని దివ్యప్రబంధంలో ఆళ్వారులు అలగియ సింగర్(అందాల నరసింహుడు) అనే పేరుతో పిలిచారు. ఈ స్వామివారి దేవాలయం బయట చిన్న అరుగు ఉంటుంది. దానిపై మనం కోరుకున్న కోరికలను చేతితో రాస్తే తప్పక ఫలిస్తాయని భక్తుల నమ్మకం.



 యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, , భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి.


ఓం నమో వేంకటేశాయ .


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat