జాతకాలు మార్చగల శక్తి మన చేతిలో ఉన్నప్పుడు వాటికి అంత ప్రాముఖ్యం ఎందుకు?*

P Madhav Kumar

 


*పెళ్లికి జాతకాలు కలవకపోతే పేర్లు మార్చుకుని పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. జాతకాలు మార్చగల శక్తి మన చేతిలో ఉన్నప్పుడు వాటికి అంత ప్రాముఖ్యం ఎందుకు?*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
పెళ్లి చేయటానికి జాతకాలు చూసే పనిలేదు.

జ్యోతిషుడు ఇలా చెప్తున్నాడు అని ఆశ్చర్యంగా ఉందా.?

నేను చెప్పేది నిజం. సీతా రాములకు కానీ, పాండవులకు ద్రౌపదికి కానీ, దుష్యంతుడు శకుంతలకు కానీ, నల దమయంతులకు కానీ జాతకాలు కలిసినట్లు ఉన్నదా.? కేవలం వివాహాలకు మాత్రం ముహూర్తం చూసుకున్నారు. కలియుగంలో ప్రధానంగా చూడవలసిన జ్యోతిష విధానం అయిన పరాశర విధానంలో కూడా పరాశర మహర్షి అన్న మాట ఏమిటంటే ఇద్దరి మనసులు కలిసినచో చక్కగా వివాహం చేయవచ్చు అని.

కాబట్టి జాతకాలు కలిసాయా లేదా అన్న మీమాంసను కట్టిపెట్టి లక్షణం అయిన సంబంధం అయితే కనుక చక్కగా వివాహం జరిపించుట మంచిది.

పేర్లుమార్చే పనిలేదు.

*జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకోవచ్చా?*

చేసుకోవచ్చు, పురాణ పురుషులు ఎలా పెళ్లి చేసుకున్నారో ఒకసారి చూస్తే అర్దం అవుతుంది:

శ్రీ రామ చంద్రుడు: సీతా దేవిని పెళ్లి చేసుకోవడానికి మిథిలా నగరం వెళ్ళలేదు. జాతకాలు చూడలేదు. శివ దనుర్భంగం తర్వాత, వరుడు యోగ్యుడు అని జనకుడు దశరథుడిని పిలిపించి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు.
శ్రీ కృష్ణుడు :
రుక్మిణీ దేవిని పెళ్లి చేసుకున్నప్పుడు జాతకాలు ప్రశ్న రాలేదు,
జాంబవతీ దేవిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా జాతకాలు చూడలేదు.
సత్యభామ తో పెళ్ళిలో కూడా జాతకాలు కలవడం వల్ల కాకుండా శమంతక మణి ఘటన తర్వాత, సత్యభామ తలిదండ్రులు కృష్ణుడికి ఇచి పెళ్లి చేశారు.
తర్వాత చేసుకున్న నాగ్నజితి, లక్ష్మణ, కాళింది, భద్ర, మిత్రవింద లను రాజకీయ కారణాలతోనే చేసుకున్నారు.
పార్వతీ పరమేశ్వరులు: ఆదిదంపతులు, వారికి జాతకాలు, గ్రహాలు పని చేయవు.
మన పూర్వీకులు: జాతకాలను పెద్దగా పట్టించుకోలేదు, అయినా చాలామటుకు బాగానే ఉన్నారు. ఒకవేల నచ్చకపోతే విడిపోయేవారు నచ్చినట్టు బతికేవారు.
మరి జాతకాల పిచ్చి ఎక్కడ మొదలైంది?

పెళ్లి అంటే జన్మ జన్మల సంబంధం అని, జీవితంలో ఒక్కసారే చేసుకోవాలి అని, విడిపోవడం ఒక పెద్ద విషయం అని, భర్త కొట్టినా, తిట్టినా అక్కడే పడి ఉండాలని, ఇలాంటి ఆలోచనా ధోరణితో ఆ ఒకే ఒక్క జీవిత కాల నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోవాలి అని, జాతకాలను ఆశ్రయించడం మొదలై, అదే కేవలం జాతకాలు కలిస్తే చాలు జీవితం బాగుంటుంది అనే పిచ్చి దాకా వెళ్లింది.

మరి తగ్గడానికి మార్గం?

పెళ్లి జీవితంలో ఒక ముఖ్య భాగమే, కానీ, అదే జీవిత పరమార్థం కాదు, మనకు వచ్చిన భాగస్వామి మంచివారు, మనకు తగినవరు అవునా కాదా అని చూసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోతే విడిపోయి ఎవరి దారి వారు సామరస్యంగా చూసుకోవడం తప్పు కాదు అని అనుకోవడం. ఇది శాస్త్రం లోనిదే కల్పితం కాదు కానీ మన ప్రవర్తన బాగాలేక విడిపోవడం అనేది శాస్త్రంలో ఎక్కడ లేదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat