🕉️శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸
💐ఈ ఆరు మానవుని అంతః శత్రువులు, ఒకదానికి ఒకటి లంకె, తనకు ఆనందం కలిగిస్తుందనుకున్న వస్తువు తన వద్ద లేకపోతే సంపాదించాలనుకోవడం. ప్రేమ పెంచుకోవడం కామం. దానిని పొందడంలో ఆటంకాలు ఏర్పడితే వచ్చేది క్రోదం. కావలసిన దానిని పొందినప్పుడు ఇంకా కావాలని అనిపించేది లోభం. తనకు సంపదలు ఉన్నాయని గర్వించి, తాను ఎంతో గొప్ప వాడిని అనుకోవడం మోహం. ఆ మోహముతో తక్కిన వాళ్ళని ఈ సడించి తన అధికారాన్ని చూపించేది మదం. ఇతరులకు ఉన్న దానికి ఈర్ష పడడం మాత్సర్యం. ఈ ఆరు లౌకికమైన సంపదలను గురించి ఏర్పడేవే. మనసులో కలిగేవి. ఈ మనసును భగవంతుని వైపు తిప్పుకుంటే అవి పవిత్రములైన ఉత్తమ లక్షణాలుగా మారుతాయి.