పూజంతా చేసి “పాపోహం పాపకర్మాహం" అని దేవుని ముందు ప్రదక్షిణం చేయడం తప్పుకదా!

P Madhav Kumar

 ప్ర : పూజంతా చేసి “పాపోహం పాపకర్మాహం" అని దేవుని ముందు ప్రదక్షిణం చేయడం తప్పుకదా! పూజించాక ఇంకా ఎక్కడ పాప ముంటుంది? కాబట్టి "పుణ్యోహం-పుణ్య కర్మాహం” అనుకోవడం మంచిదికదా!

జ: ప్రదక్షిణల వల్ల పాపాలు పోతాయనేది నిజమే. అయితే మనం మనసారా మన తప్పుల్ని ఒప్పుకోవాల్సిందే. మన పాపాలను దాపరికం లేకుండా దేవుని ముందు ఒప్పుకోవడానికే పెద్దలు ఆ శ్లోకం ఉంచారు. సంప్రదాయంగా వస్తున్న సదాచారాలలో చాలా గంభీరార్థం ఉంటుంది. ఆవేశపడి వెంటనే మార్చేయకూడదు.

పైగా-జీవుడికి కర్మసంచితాలు ఎన్నో అతడే నిర్ణయించలేడు. ఒక్క పూజతోనే పోయేవికావుగా. కొన్ని కొన్ని క్రమ క్రమంగా నశిస్తుంటాయి. ఇంకా చేయబోయేవీ ఉంటాయి కదా! "పుణ్యోహం” అని చెప్పాక, ఇంక “త్రాహిమాం” ఎందుకు? తప్పులు ఒప్పుకొనే నిజాయతీలో శరణు వేడడం ఆ శ్లోకంలో భావం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat