తరచు మా ఇంట్లో శారదా అని అన్నప్పుడు వద్దు తల్లి శారదారాద్య అని పిలవమని చెప్పేవారు. అప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు.
ఇది 5 అక్షరాల నామముగా అమ్మవారికి నమస్కరించాలి అని ఎప్పుడైనా శారదా దేవికి నమస్కారం చేసినప్పుడు...
"శారదారాద్య నమః అని చెప్పాలి"
శారదా,=సరస్వతీచే.
ఆరాధ్య,=ఆరాధింపబడినది..
శ=అనే అక్షరం శాంతిని సుఖాన్ని శుభాన్ని చూచిస్తుంది.
"ర" కారం వెలుగును చూపిస్తుంది.
ఈ రెండు అక్షరాల కలిగినదే శరత్ అనే పదం.
శాంతిని తెలుపు రంగుగా పరిగనిస్తాము కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగుల. పరమ ప్రకాశవంతమైన లక్షణం కలిగిన వస్తువుని గాని వ్యక్తిని గాని వాతావరణాన్ని గాని శరత్ అనే పదంతో సూచించవచ్చు.
ఈ శరత్ లక్షణం కలిగినది కాబట్టి సరస్వతిని శారదా అన్నారు.
ఈ శరత్ లక్షణం ఉండే కాలాన్ని శరత్ ఋతువు అంటారు.
అశ్విని మొదటి నక్షత్రం కాబట్టి ఒక విధంగా ఈ మాసం సంవత్సరానికి ప్రారంభమవుతుంది.
భూమ్మీద జలాలకు వడపోత శరత్ ఋతువులో జరిగితే. స్వేదనం వేసవిలో జరుగుతుంది.
కాబట్టి ఈ రెండు కాలాలలో జలాన్ని మనం చూస్తూ ఉంటాము చాలా స్వచ్ఛంగానే ఉంటుంది.
బురద వండ్రు ఉండదు కాబట్టి శరత్ ఋతువులోనూ ఇటు సంవత్సరం ప్రారంభ కాలంలోనూ కూడా ఈ స్వచ్ఛత లక్షణం గా భావించి కలిగిన ప్రతిరూపకంగాఅమ్మవారిని పూజిస్తూ ఆరాధిస్తారు.
ప్రజ్ఞ.. ముఖంలోకి వచ్చినప్పుడు (ముఖం అంటే సంస్కృతంలో నోరు) అప్పుడు వాక్కుగా వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తమైన వాక్కుకు సంబంధించిన దేవతను శారద అంటారు.
వాగ్దేవి అయిన శారదా దేవిచే (వసిన్యాది వాగే వతులతో సహా) స్తుతింపబడి ఆరాధింపబడేదే కాబట్టి అమ్మవారు శారదారాద్య అయింది.
సరస్వతీ దేవి సకల విద్యా స్వరూపిణి సకల గుణ నిధి వాక్కు కరిదేవత అట్టిదేవత నిత్యము దేవిని ఆరాధిస్తుంది…సరస్వతి కటాక్షం పొందిన కవులు వాగ్గేయకారులు సకల కళలు నేర్పిన వారు వారి పాండిత్య ప్రతించుటకు కానీ లేక భక్తితో కానీ ఆ తల్లిని కీర్తించి కీర్తిని పొందుతారు. హట్టి శారదా ఆరాధ్య కీర్తించబడినది కనుక శారదారాద్య అన్నారు.
సరస్వతి చే ఆరాధించబడే తల్లి అన్ని విద్యలకు అధిదేవత అన్ని విద్యలు ఆమెనుండే ఉద్భవించినవి.. సృష్టికార్యంలో సకాలంలో నెరవేర్చాలన్న త్రిమూర్తులకు జ్ఞాన స్వరూపినియై జ్ఞాన శక్తిని ప్రసాదించే తల్లి శారద అంటే సరస్వతి అంటే జ్ఞానం చే ఆరాధించబడే తల్లి కనుక శారదారాధ్యll
శారదా రా ధ్యా.. కింది అర్ధాలను సూచిస్తుంది.
శారదా దేవి సరస్వతీ దేవిచే ఆరాధింపబడినది.
శరత్ ఋతువు లో ఆరాధింపబడినది.
సంవత్సరాల ఆరంభంలో ఆరాధింపబడినది.
వసున్యాది వాగ్దేవతలతో పూజింపబడినది.
సరస్వతీ స్వరూపాలచే సరస్వతి చే కీర్తించబడే ఈ తల్లి నామాన్ని గాని జపాన్ని గాని చేసిన వారికి జ్ఞానం అభివృద్ధి చెంది. ఉన్న పదవి నుండి ఉన్నత స్థితిని అడగకుండానే కలిగిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి చెడు దృష్టి నుంచి తల్లి రక్షిస్తుంది.
సరస్వతి ద్వాదశ నామాలలో శారదా అను నామము మొదటగా చూస్తాము దీనిని బట్టి శారదా దేవి తర్వాత సరస్వతిని పరిగణలోకి తీసుకుంటాము.
శారదా దేవి శక్తిపీఠం శృంగేరిలో కలదు.
శారదా పాహిమాం శంకరా పాహిమాంll