💠 100 ఎకరాల స్థలం..200 కోట్ల వ్యయం.. 11,000 మంది శ్రమ...20,000 విగ్రహాలు అన్నీ కలిస్తే ఓ అద్భుత ఆలయం!
ప్రపంచ వింతల్లో ఒకటి!
అదే " అక్షరధామ్" స్వామి నారాయణ్ మందిర్
💠 ప్రపంచ వింతల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్తవి చేరుతూ ఉంటాయి.
అలా అంతర్జాతీయ ప్రముఖ రెజెస్ట్ పత్రిక గుర్తించిన ఏడు వింతలో ఢిల్లీలోని అక్షరథామ్ స్వామి నారాయణ్ ఆలయం ఒకటి
💠 'అక్షరధామ్' అంటే భగవంతుని దివ్య నివాసం. ఇది భక్తి, స్వచ్ఛత మరియు శాంతి యొక్క శాశ్వతమైన ప్రదేశంగా ప్రశంసించబడింది.
న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఒక మందిరం - భగవంతుని నివాసం, హిందూ ప్రార్థనా మందిరం మరియు భక్తి, అభ్యాసం మరియు సామరస్యానికి అంకితమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వివాసం
💠 స్వామినారాయణ అక్షరధామ్
6 నవంబర్, 2005న తెరవబడింది.
నవంబరు 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది.
💠 శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) ద్వారా నిర్మించబడింది,
యోగిజీ మహారాజ్ (1892-1971 ) ప్రేరణతో
ఆయన శిష్యులు ప్రముఖ్ స్వామి మహారాజ్ రూపొందించారు.
⚜ స్వామి నారాయణ్ చరిత్ర ⚜
💠 ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యకు సమీపంలో వున్న ఛాపయ్యా గ్రామంలో 1781 లో ఆయన జన్మించాడు. ఏడవ ఏటనే పవిత్ర గ్రంథాల్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. నాలుగేళ్ళ తర్వాత ఆధ్యాత్మిక యాత్రీకుడిగా ఇల్లు వదిలి వెళ్ళాడు. ఏడేళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి, వివిధ సంస్కృతీ రూపాల్ని ఆకళింపుజేసుకుని, చివరకు గుజరాత్‍లో స్థిరపడ్డాడు.
సాంఘీక- ఆధ్యాత్మిక విప్లవానికి నాందిపలికి' స్వామి నారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు.
లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు.
49 ఏళ్ళు ఈ భూమ్మీద జీవించి, తన వారసుల దీక్ష, తన బోధనల ప్రాచుర్యం ద్వారా, తాను అమలుపరచిన సంప్రదాయం "అక్షరం" (వినాశనం లేనిది) గా కొనసాగే మార్గం సుగమం చేశాడు.
అందుకే ఆ భవన సముదాయం "అక్షరధామ్"గా ప్రసిద్ధిపొందింది.
ఆ సంప్రదాయానికి చెందిన బ్రహ్మ స్వరూప్ యోగీజి మహారాజ్ 1968 లో ఒక కోరిక వెలిబుచ్చాడు. యమునాతీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నదే ఆ అకాంక్ష. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో రెండు దశాబ్దాల కృషి ఫలితంగా నేటి స్వామి నారాయణ్ అక్షరధామ్ వెలిసింది.
💠 ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరొందిన దీన్ని 200 కోట్ల రూపాటు వ్యయంతో నిర్మించారు.
100 ఎకరాల ప్రాంగణంలో నెలకొల్పిన ఇందులో మొత్తం 20,000 శిల్పాలను నిలువెత్తున అపురూపంగా మలిచారు.
ఏకంగా 11,000 మంది శిల్పకారులు 5 ఏళ్ళు శ్రమించారు.
రాజస్థాన్ నుంచి ఎర్ర చలువరాయిని తెప్పించారు. ప్రధాన ప్రాంగణం 356 అడుగు ఎత్తుగా ఉంటుంది. మొత్తం 234 స్తంభాలు అపూర్వమైన శిల్పకళతో కనువిందు చేస్తాయి.
💠 అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఆ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తుంటాయి.
148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు, 20,000 దేవతా విగ్రహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనం లోని ప్రతి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.
💠 ఇక్కడ నిర్మించిన మెట్ల బావి దేశంలోనే అతి పెద్దది. దాదాపు 2,870 మెట్ల మధ్య 300 అడుగుల పొడవు వెడల్పులలో కమలాకారంలో యజ్ఞగుండం ఉంటుంది.
రాత్రివేళల్లో ఫౌంటేషన్ గా మారుతుంది.
💠 ఇక్కడి పడవ విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది.
పదివేల ఏళ్ల భారతీయ చరిత్రకు అద్దం పట్టే కట్టడాల మీదుగా ప్రయాణం సాగుతుంది. ప్రపంచంలోనే మొదటిదైన తక్షశిల జీవన శైలికి సంబంధించిన నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. ఆలయంలో 11 అడుగులు ఎత్తున నారాయణ్ విగ్రహం చుట్టూ వేర్వేరు దేవతల రూపాలు కొలువై ఉంటాయి. గొప్ప ఆధ్యాతి వేత్తగా పేరొందిన స్వామి నారాయణ్ శిష్యులే దీన్ని రూపొందించారు.
💠 ఈ భవన నిర్మాణానికి లోహాన్ని (స్టీలు) ఉపయోగించకపోవటం ఓ విశేషం.
ఈ మందిరం అంతా ఎరుపు రాళ్ళ గోడల్ని కలిగి ఉంది. అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద మందిర నిర్మాణం నమ్మశక్యం కాకుండా ఉంది. స్వామి నారాయణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మందిర పరిసరాలు ఇంకా వృద్ధిలోకి వస్తున్నాయి. దాదాపు పదివేల సంవత్సరాల హిందూ సంస్కృతీ చిహ్నాల్నీ మందిరంలో భద్రపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
💠 60 ఎకరాల ప్రశాంత వాతావరణంలోని కొలనులో ఓ పది నిమిషాల బోటు ప్రయాణం హిందూ సంస్కృతికి సంబంధించిన దృశ్యాలను దర్శింపచేస్తుంది.
సాయంకాలం 'లైట్ అండ్ సౌండ్ షో'ని ప్రదర్శిస్తారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ 'అక్షర ధామాన్ని' అతి పెద్ద హిందూ దేవస్థానంగా తన రికార్డులో నమోదు చేసుకుంది.
© Santosh Kumar