🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿శ్రీ అనంత పద్మనాభస్వామి వారు ఆదిశేషునిపై పవళించి హాయిగా నిద్రిస్తుంటారు . నాభిలో ఉన్న బ్రహ్మగారు సృష్టిని రచిస్తుంటారు . అనంతశయుని పాదాలని ఆశ్రయించిన మాత అనంతలక్ష్మి పాటి పాదసేవలో నిమగ్నమై ఉంటుంది .
🌸వీళ్లెవరికీ ఆ అనంతునికి నిద్రాభంగం కాకుండా, కాపలా కాసేందుకు బొత్తిగా తీరికేలేదు. అందుకేమరి, సరోవరంలో సేవకి తానూ సిద్హమని వచ్చేశాడో వీరుడు.
🌿సడిసేయకోగాలి సడిసేయబోకే ….
సృష్టి రక్షణలోన స్వామి , బడలి శయనించెనే , అంటూ ఆ స్వామిని కాచే అంగరక్షకుడు స్వామి
సరస్సులో నే తిరుగాడుతుంటాడు .
🌸 ఆదిశేషుడేగా ? అంటారేమో , కానీ కాదు , అరివీర భయంకరమైన మకరం . అదేనండీ మొసలి .
🌿మొసలి పేరు బాబియా.ఈ మొసలి ఎవరికీ ఎలాంటి హాని చెయ్యదు .పైగా శుద్ధ శాఖాహారి .రోజూ అక్కడి ఆచార్యవర్యులు పెట్టె పరమాన్నం మాత్రమే తింటుంది.ఆ సమయాల్లో మాత్రమే బయటికి వస్తుంది .దాదాపు గత 70 ఏళ్లుగా ఈ మొసలి ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు స్థానికులు .
🌸ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ సరస్సులో ఇది మూడవ మొసలి కాగా, ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి అనేది సరస్సు లో కనిపిస్తుంది. ఇక సరస్సు మధ్యలో ఈ ఆలయం ఉంటుంది . కానీ , చుట్టూ ఈ సరస్సుకి అనుసంధానంగా సముద్రం, నది వంటివి ఏవీ ఉండవు .
🌿 అయినప్పటికీ ,ఈ మొసలి ఎటునుండి వస్తుందనేది ఎవరికీ తెలియదు.
అందుకే ,ఇది అనంతుని లీలేనని, ఆ మకరం స్వయంగా స్వామివారి మరొక రూపమని, అనంతపద్మనాభుడి అంగరక్షకుడని భక్తులు భావిస్తుంటారు .
🌸ఈవిధంగా ప్రకృతి అందాల నడుమ, సువిశాలమైన ప్రదేశంలో, ఆశ్చర్యకరమైన లీలావిలాసాలతో కూడిన ఈ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు . విచిత్రమైన మొసలిని దర్శించుకొని అచ్చెరువుతో నమస్కరిస్తుంటారు .
🌷ఎక్కడ ఉంది :🌷
🌿కేరళ రాష్ట్రంలోని కాసర్ గోడ్ జిల్లా, అనంతపురంలోని సరోవర మందిరం ఇది. ఈ ఆలయం చుట్టూ సరస్సులతో రెండు ఎకరాల స్థలంలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు .
🌷స్థలపురాణం :🌷
🌸అనంత పద్మనాభుని అంగరక్షకుడు ఎవరో తెలుసా ?
ఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, పూర్వం శ్రీమహావిష్ణువు భక్తుడైన బిల్వమంగళుడు ఇక్కడి సరస్సు వద్ద తపస్సు చేసుకుంటూంటాడు . అప్పుడు అతని వద్దకు ఒక బాలుడు వస్తాడు .
🌿ఆ బాలుడికి ఎవరులేరని తెలియడంతో, తన దగ్గరే ఉండమని బాలుడికి ఆశ్రయాన్ని ఇస్తాడు. . అయితే నన్ను ఎప్పుడు ఇబ్బందిపెట్టకూడదు, అవమానించకూడదు,
🌸ఒకవేళ నన్ను ఏదైనా అంటే నేను ఇక్కడి నుండి వెళ్లిపోతానని ఆ బాలుడు చెప్పడంతో దానికి బిల్వమంగళుడు సరేనంటాడు .
🌿అయితే ఎప్పుడు అల్లరిచేసే ఆ బాలుడి చేష్టలకి ఒకసారి బిల్వమంగళుడు మందలిస్తాడు . దాంతో అలిగిన బాలుడు ఒక గుహలోకి వెళ్ళిపోతాడు.
🌸బాలున్ని వెతుక్కుంటూ బయల్దేరిన బిల్వమంగళుడు , అతను సరస్సు పక్కన ఉన్న ఒక గుహలోకి వెళ్ళాడని తెలుసుకొని , వెతుకుంటూ ఆ గుహలోకి వెళ్తాడు .
🌿అలా ఆ గుహ లోపల వెతుక్కుంటూ వెళ్లిన బిల్వమంగళుడు తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయానికి చేరుకుంటాడు .
🌸గుహలో బాలుడు అదృశ్యం అవ్వడం, గుహ నుండి వెళితే స్వామివారి ఆలయానికి చేరుకోవడంతో ఇన్ని రోజులు తనతో ఉన్నదీ శ్రీమహావిష్ణువే అని గ్రహించి, అక్కడి సరస్సులో ఈ గుడిని కట్టించాడు. ఆ ఆలయమే అనంతపురం లోని సరోవర మందిరం.
🌿అద్భుతమైన ఈ అనంత పద్మనాభుని వీలయితే , ఒకసారి తప్పక దర్శించండి....స్వస్తీ...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸