నవగ్రహ సంబందిత క్షేత్రాలు
నవగ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.
సూర్యుడు
1. హర్షవల్లి సూర్యనారాయణ స్వామి (శ్రీకాకుళం జిల్లా)
2. పెద్దాపురం సూర్యనారాయణ స్వామి (తూర్పుగోదావరి)
3. గొల్లలమామిడాడ సూర్యనాయణ స్వామి (తూర్పుగోదావరి)
4. నందికొట్టూరు సూర్యనారాయణ స్వామి (కర్నూలు)
చంద్రుడు
1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమవరం, పశ్చిమ గోదావరి)
2. కోటే పల్లి సోమేశ్వర స్వామి (తూర్పుగోదావరి)
3. విజయవాడలో కనకదుర్గాదేవి, పెద్దకళ్ళే పల్లెలో దుర్గాదేవి. (కృష్ణ)
4. జొన్నవాడ కామాక్షితయారు అమ్మవారు. (నెల్లూరు)
అంగారకుడు
1. మోపిదేవి సుబ్రమణ్యస్వామి మరియు చోడవరం (కృష్ణ)
2. బిక్కవోలు సుబ్రమణ్యస్వామి మరియు పెద్దాపురం (తూర్పుగోదావరి)
3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూరపాడు పుట్ట, మంగళగిరి సుబ్రమణ్య స్వామి, పొన్నూరు. (గుంటూరు)
బుధుడు
1. ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి)
2. ర్యాలీ, అన్నవరం, పిఠాపురం కుంతీమాధవ స్వామి (తూర్పుగోదావరి)
3. శ్రీ కాకుళంలో ఆంధ్రా మహావిష్ణువు (కృష్ణ)
4. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి (చిత్తూరు)
బృహస్పతి
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు (గుంటూరు)
2. అలంపురంలో బ్రహ్మదేవుడు (మహబూబ్ నగర్)
3. కోటి పల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మందపల్లిలో బ్రహే్శ్వర స్వామి (తూర్పగోదావరి)
4. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి. , కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి (గుంటూరు)
శుక్రుడు
1. విశాఖ పట్టణం కనకమహాలక్ష్మి, పింహాచలం లక్ష్మీ దేవి (విశాఖ)
2. అలిమేలు మంగాపురం, పద్మావతీ దేవి (చిత్తూరు)
3. పెంచలకోన ఆది లక్ష్మీదేవి (నెల్లూరు)
శని
1. మందపల్లెలో మందేశ్వర స్వామి (తూర్పుగోదావరి)
2. హిందుపురం తాలూకా పావగడలోని శనిమహాత్ముడు (అనంతపురం)
3. విజయ వాడలోని కృష్ణనది తీరాన జ్యేష్ణదేవి సహిత శనైశ్చర్య స్వామి (కృష్ణ)
4. నర్శింగోలు (సింగరాయ కొండ వద్ద) శనీశ్వర స్వామి (ప్రకాశం)
రాహువు, కేతువు
1. శ్రీ కాళహస్తి (చిత్తూరు)
2. మందమల్లి నాగశ్వర స్వామి (తూర్పుగోదావరి)
3. విజయవాడ కనకదుర్గా దేవి (కృష్ణ)
4. సంపత్ వినాయక స్వామి (విశాఖ)
5. అమరావతి వినాయకస్వామి, తెనాలి వైకుంఠపురం పుట్ట (గుంటూరు)
గమనిక:
ఈ క్షేత్ర దర్శనములన్నియు ఒక్క వారము రోజులలో పూర్తి చేసినచో తగిన పలితములు పొందుతారు