👉 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 🔆 మెహబూబ్ నగర్ జిల్లా : #సింగోటం

P Madhav Kumar


⚜ లింగరూపంలో నరసింహస్వామి దేవాలయం ఎక్కడో మీకు తెలుసా ?


💠 ప్రహ్లాదుడి మాట దక్కించడం కోసం ఆహోబిలం క్షేత్రంలో స్తంభంలో సాక్షాత్కరించాడు నరసింహస్వామి. అవతార ప్రయోజనం పూర్తయ్యాక.. దండకారణ్యమంతా కలియ తిరిగాడట నరహరి. అలా స్వామి అడుగుపెట్టిన ప్రతి నెలవూ.. పవిత్రమే. 


💠నరసింహస్వామి అంటేనే.. నరుడు, మృగం కలగలసినరూపం. సింహం ముఖం, మానవ శరీరంతో కనిపించే రౌద్ర దేవుడు. కానీ, సింగోటంలో మాత్రం లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు..

దేశంలో ఎక్కడా కనిపించని విధంగా, ఇక్కడ లింగ రూపంలో కొలువయ్యాడు. 

భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకొంటున్నాడు.


💠 నారసింహ స్వామి లింగరూపంలో వెలసిన ఆలయం తెలుగు రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం. ఆ ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి తెలుసుకుందాం…


💠 ఈ దేవాలయం నాగర్ కర్నూల్ జిల్లా ( ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లా) , కొల్లాపూర్ మండలంలోని సింగోటం లో ఈ దేవాలయం ఉంది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి లింగరూపంలో స్వయంభువుగా వెలసిన దివ్యక్షేత్రం.

నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం తరువాత ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. 


💠 వెయ్యేళ్ళ క్రితం సురభి వంశస్థులు జటప్రోలు సంస్థానాన్ని ఎలుతున్న రోజులవి. అప్పటి జటప్రోలు సంస్థానాదీశుడు రాజ సింగమనాయుడు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని శాసన చరిత్ర చెబుతోంది. సింగమనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి దైవాజ్ఞయే ప్రభల కారణమని స్థల చరిత్ర 


💠 ఆనాడు గ్రామానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో నాగలితో సాగు చేస్తుండగ ఆయనకు పొలంలో తరచు ఒక శిల అడ్డు తగులుతు ఇబ్బంది కలిగించేది. 

ఈ విదామైన ఆటంకం ఆ రైతుకు చాల ఏళ్ళే కోనసాగింది. తన స్వామియేనని ఆ రైతు గుర్తించ లేక పొయ్యాడు. పైగ అతను ఆ శిల గురించి అంత పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఎదో ఒక విధంగా తన పని తాను పూర్తి గావించుకొంటు కాలం గడుపుతున్నాడు. 


💠 ఈ క్రమంలో శిల రూపంలో ఉన్న తనను ఇక రైతు గుర్తించడని భావించిన స్వామి వారు నాటి ప్రభువైన రాజ  సింగమనాయుడికి మరియు బ్రాహ్మణ అగ్రహర పెద్దయిన ఓరుగంటి నర్సయ్య దీక్షితులు గారికి ఒకే సమయంలో లీల మాత్రముగా స్వప్న దర్శనం ప్రసాదించి తను శిల రూపంలో ఉన్న చోటును తెలిపి, ఆ రైతు తనను గుర్తించక పోవాటాన్ని వివరించి తనను వెంటనే అక్కడి నుండి వెలికి తీసి తనకు ఆలయం నిర్మించమని చెప్పి స్వామి వారు అంతర్థానమైనారు. వెంటనే కల చెదిరి నిద్ర నుండి మెలుకోన్న రాజు అప్పటికప్పుడు తన సైన్యంతో బయలుదేరి కాగడాల సాయంతో వెతికించి ఆ రైతు వ్యవసాయ క్షేత్రంలో శిలా రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ్మ స్వామి వారిని గుర్తించి అక్కడి నుండి వెంటనే వెలికి తీయించి  స్వామి వారికి ఒక చిన్న గుడిని కూడా నిర్మించారు. 


💠  స్వామి ఆలయం చెంతనే మనోహరమైన కోనేరు కలదు.దీనిని శ్రీ వారి కోనేరు అని పిలుస్తారు. సమీపంలోనే ఒక పెద్ద తటాకం కూడ ఉన్నది. దీనిని శ్రీవారి మహా సముద్రంగా వ్యవహరిస్తారు.


💠 శ్రీ స్వామి వారి ఆలయానికి సుమారు ఒక కిమీ దూరంలో గల గుట్టపై లక్ష్మి దేవి అమ్మవారు కొలువైవున్నారు. అమ్మవారు వెలసిన ఈ గుట్టను రత్న లక్ష్మీ దేవి గుట్ట అని పిలుస్తారు.

అ గుట్ట రత్నగిరి అన్న పేరుతో లెస్సగా వాసికెక్కింది. సింగవట్నం వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించిన పిదప విధిగా అమ్మవారిని దర్శించుకోని వెళతారు.


💠 ఇక్కడి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు కొత్తవాళ్లైతే నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడోనని వెతుక్కుంటారు. ఎదురుగా దివ్యమైన లింగరూపంలో ఉన్నస్వామిని చూడగానే ముందు ఆశ్చర్యాన్ని, తరువాత ఆనందాన్ని పొందుతారు. అడుగు, అడుగున్నర ఎత్తున ఉన్న లింగరూపంలో ఊర్థ్వపుండ్రాలు, త్రిపుండ్రాలు ధరించి (పంగనామాలు, విభూతిరేఖలు) చక్కగా వెనుకకు మెలితిప్పిన మీసాలతో స్వామి ధీరగంభీరంగా కనిపిస్తాడు.


💠 ఏటా మాఘమాసంలో మకర సంక్రమణను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ రథోత్సవం కీలకమైంది. ఈ రథోత్సవాన్ని, సింగోటం జాతరగా, తేరుగా భక్తులు పిలుస్తారు. ఈ ఒక్కరోజే సుమారు లక్షకుపైగా భక్తులు సింగపట్నానికి తరలి వస్తారు. ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుండి కూడా భక్తులు వస్తుంటారు.


💠.ఈ నృసింహాలయంలో అర్చకులుగా స్మార్తులను ఆ కాలంలోనే నియమించారు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి విష్ణురూపుడైనా శైవులు పూజారులుగా ఉంటూ ఆనాటినుండి శివకేశవాద్వైతాన్ని పరిరక్షిస్తున్నామని ఆలయ పూజారి చెప్పారు. అనంతర కాలంలో శ్రీ నరసింహస్వామికి కుడి వైపు ఉపాలయంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. కావున ఇది శివకేశవాలయంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ చరిత్ర అర్చకులు చెప్పిందే కాని లిఖిత పూర్వకంగా ఎక్కడా లభించక పోవడం భక్తులకు నిరాశ కల్గిస్తుంది.


💠 రవాణా

ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది.  వనపర్తి నుండి 31 కి.మీ, హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో ఉంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat