*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🌻గురువారవిశేషము (పూలంగి) తోమాల సేవ🌻*
🍃🌹అర్చకులు ఆ అంతర్ద్వారము యొక్క తలుపులు మూసివేసి ఏకాంతముగా శ్రీస్వామివారికి పుష్పాలంకారమును ప్రారంభించెదరు.
🍃🌹వివిధములై, విచిత్రములై, సుగంధములై, రమణీయములై యున్న పుష్పమాలికలతో శ్రీవారికి వస్త్రరూపముగాను, ఉత్తరీయరూపముగాను, ఆభరణరూపములుగాను, కిరీటరూపముగాను, శంఖ చక్రరూపము గాను, తిరుమేను అంతయు పుష్పమయమగునటుల అలంకరించెదరు. దుష్టశిక్షణ దక్షమగు సూర్య కఠారి అను ఖడ్గమును శ్రీస్వామివారి వామ హస్తమునందుంచి పుష్పమాలలతో నలంకరించెదరు.
🍃🌹ఆ సమయమున పుష్పములతోను పుష్పమాలికలతోను, నిండి అతివిచిత్ర సన్నివేశములో యున్న శ్రీస్వామివారి తిరుమేనునంతయు చూడంచూడ, పూలంగిని ధరించిన శ్రీస్వామివారు పుష్పా స్రుడగు మన్మథుని సౌందర్యముకంటే కోటిరెట్లు ఎక్కువ సౌందర్యముకలవారై భక్తులకు తమ కోటి మన్మథ సౌందర్యమును చూపనుందురు.
🍃🌹పూలంగి సమర్పణము పూర్తికాగానే అంతర్ద్వారము తలుపులు తీసి శ్రీవారికి కర్పూరహారతి చేసెదరు. ప్రబంధ పారాయణస్వాములు అందరు సన్నిధికి వెళ్ళేదరు. ప్రబంధపారాయణమును ముగించెదరు. కర్పూరహారతి జరుగును. మామూలు ప్రకారం మంత్ర పుష్పం జరిగి హారతి జరుగును.
*🌻అర్చనము🌻*
పిమ్మట మామూలు ప్రకారం శ్రీవారికి తాయార్లకు అర్చన జరిగి కర్పూరహారతి జరుగును.
*🌻నివేదనము🌻*
వెంటనే శ్రీస్వామివారికి మళుహోర, పొంగలి, దోసె, పణ్యార ములు కాక విశేషముగా శైత్యోపచారమునకై వడపప్పు, పానకము నివే దనము జరుగును. తిరువీసముకూడా నివేదనము జరిగి ఏకాంతముగా శాత్తుమొర జరుగును.
*🌻పూలంగిదర్శనము🌻*
పిమ్మట అధికారులు అందరు పూలంగిని ధరించిన శ్రీస్వామి వారిని సేవించి క్షమాపణమును కోరుచూ వెళ్ళుచుందురు.
🍃🌹వెంటనే ఆర్జితముగా పూలంగిదర్శనము* ప్రారంభమగును. ఈ దర్శనములో పూలంగిని ధరించిన శ్రీస్వామివారిని సేవించిన ప్రతి మానవుడు భక్తుడై మితిలేని ఆనందము కలవాడై తీర్థస్వీకారము చేయుచూ, పాదుకాధారణము చేయుచూ, ధన్యతను తలపోయుచూ శ్రీవారి కటాక్ష పాత్రుడగుచూ వెళ్ళుచుండును. (మునుపు ఆర్జిత సేవగా ఉండినది 'పూలంగి సేవ' ప్రస్తుతము 'పూలంగి సర్వదర్శనము' గా మార్చబడినది. కనుక నేడు పూలంగి సేవను ఆర్జిత సేవగా నిర్వహించుటలేదు.)
🍃🌹ఒక్కొక్క గురువారం పూలంగిని ధరించియున్న శ్రీస్వామివారిని సేవించి శ్రీవారి కటాక్ష పాత్రులగుచు వేలాది భక్తజనులు కృతార్థులగు చున్నారు.
*🌻శుద్ధి🌻*
ఇటుల ఆర్జితమగు పూలంగి దర్శనము పూర్తికాగానే దేవాలయములో శుద్ధి జరుగును.
*🌻ఏకాంత సేవ🌻*
మామూలు ప్రకారం ఏకాంత సేవ జరుగును. కైంకర్యపరులు అందరు కోవెల తీర్మానము చేసుకుని స్వస్థానములకు వెళ్ళేదరు. ఇదియే గురువార విశేషము.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*