శ్రీ హనుమ కధామృతము 13

P Madhav Kumar


ధాన్య మాలి వృత్తాంతం

మొసలి రూపం నుంచి విముక్తి పొంది ,అద్భుత సుందరిగా మారిన స్తీ తన వృత్తాంతాన్నిహనుమకు తెలియజేసింది .తాను ఒక దివ్య స్త్రీననీ ,తన పేరు ధాన్య మాలి అనీ చెప్పింది .”రంభ ,ఊర్వశీ ,తిలోత్తమ మున్నగు వారంతా నా ఇష్ట సఖులు .వైదిక క్రతువులలో ధన్యులైన సోమయాజులు నన్ను కామిస్తారు .యుద్ధం లో వీర స్వర్గం అలంకరించిన శూరులు ,వీరులు అందరు నాకు పార్శ్వ వర్తులు .అంటే సహ చారులు .గాంధర్వ విద్యలో నేను మేటిని .ఒక రోజూ కైలాసం లో శివుని ముందు అద్భత నృత్యాన్ని చేసి అందరినీ ఆశ్చర్య పరిచాను .నేను ఆడిన దరువు పేరు ”జక్కిణి .పరమేశ్వరుడు నా నాట్య విలాసానికి మెచ్చి ఒక దివ్య విమానాన్ని అనుగ్రహించాడు .దాని ని ఎక్కి లోకాలన్నీ తిరిగాను .ఒక రోజూ ఈ జలాశయం లో హాయిగా పాడుకొంటూ ,స్నానం చేస్తున్నాను .అప్పుడు నా పాట విన్న శాండిల్యుడు అనే ముని నన్ను చూసి మోహపరవాశం తో నా దగ్గరకు వచ్చాడు .అప్పటిదాకా చేస్తున్న జపాన్ని , తపాన్ని ఒదిలి పెట్టాడు . తనకు మోహపరవాశం కలిగించాననీ ,ఒక సారి తన వంక చూడమనీ బలవంత పెట్టాడు .ఆయన మాటలు ,ప్రవర్తన నాకు ధర్మ విరుద్ధం గా వున్నాయని అని పించాయి .ఆయన ధర్మ మార్గాన్ని వదిలి ఇలా ప్రవర్తించటం భావ్యం కాదని చెప్పా .మా మొహం యవ్వనం ,అందం అంతా అశాస్వతమైనవెననే ,శాస్వతమైన ముక్తిని కోరేతపస్సంపంనుడైన ఆయన అలా చేయటం భావ్యం కాదని బతిమి లాడాను .క్షణిక సుఖం కోసం శాశ్వత ఆనందాన్ని దూరం చేసుకో వద్దని,తన లాటి వారు ఈ విషయాలు చెప్పాల్సి రావటం బాధాకరం అనీ అన్నాను .ఇవేవీ ఆయన చెవికి యెక్క లేదు .కామం కళ్ళు కప్పేసింది .మనసు వశం తప్పింది .వినే స్థితి లో లేడు ..ఇంక తాను తాళ లేననీ ,కనికరించమనీ ,ఆలస్యం చేయవద్దని ,కాళ్ళా ,వెళ్ళా పడి బ్రతిమి లాడాడు .తన కోర్కె తీర్చాల్సిందే నని పట్టు బట్టాడు .

” నేను కొంచెం ఆలోచించాను .నేను అశుచిగా ఉన్నాననీ ,శుచి నై వస్తాననీ నమ్మకం గా చెప్పాను .ఆ కామ మోహి నమ్మి త్వరలో రమ్మని ,విరహాగ్ని తో కాలి పోతున్నాననీ వేడుకొన్నాడు .నేను వెంటనే గంధ మాదన పర్వతం చేరుకొన్నాను .అక్కడ హాయిగావీణా నాదం తో పరవశనై పాడుకొంటున్నాను .చంద్రోదయ కాలమ్ అది .పండు వెన్నెలతో లోకాన్ని పరవశం చేస్తున్నాడు తారా పతి .నా పాట విని రావణుడు అక్కడికి వచ్చాడు .అతను కామ మొహం తోనిండి వున్నాడు .తన కోర్కె తీర్చమన్నాడు .నేను యెంత ప్రార్ధించినా వినకుండా,ఆశుచిని అని చెప్పినా నన్ను అనుభవించాడు .నాకు ఒక కొడుకు పుట్టాడు రావణుని వల్ల ..ఆ కొడుకును తనతో తీసుకొని వెళ్ళాడు .నేను ఒంటరి గా మిగిలాను .

నేను మునికి ఇచ్చిన మాట ప్రకారం శుచినై ఆయన ఆశ్రమం చేరాను .ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది .నన్ను తిట్టాడు .నా యవ్వనాన్ని ఎవరికి అప్పగించానో చెప్పమన్నాడు .నియమం గా వున్న తనను నా అందం తో రెచ్చ గోట్టాననీ ,మంచిమాటలు నేను చెప్పినా విని పించు కోలేక పోయాననీ ,తన్ను మన్మధ బాణాగ్నికి గురి చేసి ,దారి తప్పెట్లు నేనే చేశానని నిందించాడు .తాను బుద్ధి హీనుడై తప్పు దోవ పట్టానని ఇప్పుడు తెలుసుకోన్నానని అన్నాడు .అందుకే మన్మధుని ధ్వజమైన మొసలి రూపం పొంది ఈ సరోవరం లో పడివుండమని శపించాడు .నేను ఇందులో నా తప్పు ఏమీ లేదనీ ,అంతా ఆయన స్వయంకృతాపరాధమే ననీ ,కుటిలుడైన రావణుని బలాత్కారమే నన్ను మున్చిందనీ ,శాప విమోచనం తెలుప మనీ వేడు కొన్నాను .నా కన్నీరుకు కరగిన ముని చంద్రుడు దయార్ద్ర హృదయం తో పరోపకార పారీణుడు ,సకల జన శోకాలను నివారించే వాడు ,శ్రీ రాముని బంటు అయిన శ్రీ ఆంజనేయ స్వామి వల్ల నా శాప విమోచనం జరుగు తుందని తెలియ జేశాడు .శాండిల్య ముని అనుగ్రహం వల్ల నీ సందర్శనం లభించి నాకు శాప విమోచనం కలిగింది .నన్నుధన్యురాలిని చేశావు .నీ మేలు మరువ లేను .నన్ను కనికరించండి .”అని కృతజ్ఞతా భావం తో దాన్యమాలి హనుమకు నమస్కరించి ,విమానం ఎక్కి దేవ లోకానికి వెళ్లి పోయింది .ఇంతటి శాపానుగ్రహ కారకుడు మన హనుమ .ఆయన దివ్య చరితం వింటున్న కొద్దీ మహదానందం గ వుంటూనే వుంటుంది

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat