*శ్రీ హనుమ కధామృతము* 16

P Madhav Kumar


💥💥💥💥💥💥

గంధ మాదన కదా

రావణ వధ జరిగిన తర్వాత శ్రీ రాముడు అందర్నీ పుష్పక విమానం లో అయోధ్యకు తన పట్టాభిషేక సంరంభాన్ని వారు చూడాలని విన్నవించు కొంటె తీసుకొని వెళ్ళాడు .అందరు విమానం ఎక్కి కూర్చున్నారు .కాని గంధమాదనుడు అనే వానరుడు అందులో యెక్క లేదని తెలుసు కొన్నారు .శ్రీ రాముడు హనుమను పిలిచి అతడు ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకొని రావలసినది గా కోరాడు .అప్పుడు విభీషణుడు గంధ మాదనుడు కుంభకర్ణుని తో జరిగిన పోరాటం లో చని పోయాడని తెలియ జేశాడు .శ్రీ రాముడు అంతకు ముందే దేవతలన్దర్నీ ప్రసన్నం చేసుకొని యుద్ధం లో వీరమరణం చెందిన తన శైన్యాని అంతటినీ పునరుజ్జీవితు లయేట్లు చేసు కొన్నాడు .గంధమాదనుడి విషయం ఎవరికి గుర్తు లేదు ..ఈ విషయం తెలిసిన శ్రీ రాముడు దుఖం తో తల్లడిల్లాడు .అపుడు జాంబవంతుడు హనుమ ఈ పని చేయ గలడు అని చెప్పాడు .అప్పుడే రాముడు హనుమను పంపటం జరిగింది .

హనుమ ఒక్కసారిగా తన శరీరాన్ని విశ్వ మంతటా విస్తరించాడు .తోకను పెంచాడు .భూమి దద్దరిల్లెట్లు ప్రణవం చేశాడు .తన తోకను నుదిటికి తాకించి కుండలినీ శక్తిని ప్రజ్వలించి ,ఆజ్ఞా చక్రాన్ని భేదించి ,సహస్రారాన్ని తాకి ఒక యోగిలా గా సర్వాంతర్యామిగా ఎదిగి పోయాడు .ఆకాశానికి ఎగిరాడు .లోకాలన్నీ భయం తో గడ గడ వణికాయి .అదే వేగం తో యమలోకానికి చేరాడు .ద్వారం దగ్గర నిలబడి సింహ గర్జన చేశాడు .యముని సింహాసనం తూలి పడింది .భయం తో కంపిస్తున్న మేను తో హనుమ ముందు కు చేరి చేతులు జోడించి నమస్కరించి పూజించాడు .విషయం వివరించాడు హనుమ .అప్పుడు యముడు గంధమాదనుడు తన యమపురి లో లేడని ,బ్రహ్మ లోకం లో ఉన్నాడని తెలియ జేశాడు .

యమునికి నమస్కారాలు తెలియ జేసి బ్రహ్మ లోకం చేరాడు వాయుపుత్రుడు ,..అక్కడి దేవతలు ,మునీశ్వరులు ,నారద ముని అందరు హనుమ కు స్వాగతం పలికారు .హనుమ బ్రహ్మ దేవుడికి నమస్కరించి తాను వచ్చిన పని చెప్పాడు .అప్పుడు బ్రహ్మ దేవుడు ”హనుమా !రామ కార్యం కోసం గంధ మాదనుడు శరీర త్యాగం చేసి అమరుడయ్యాడు .మాళ్ళీ అతను భూలోకానికి రాకూడదు .అయినా ప్రతిజ్న చేసి వచ్చావు కనుక నీ కోసం అతన్ని బ్రతికిస్తాను ”అన్నాడు .వెంటనే అతను అక్కడ ప్రత్యక్ష మయాడు .అతన్ని ప్రేమాభ్హిమానాలతో అక్కున చేర్చుకొన్నాడు హనుమ .వాణీ పతి అనుజ్న తీసుకొని అతనితో శ్రీ రామ సన్నిధి చేరాడు

గంధమాదనుడిని శ్రీ రాముడు కుశల ప్రశ్న లతో ఆప్యాయం గా కౌగిలించు కొన్నాడు .వానరులంతా అతని శరీరాన్ని తాకి పాత విషయాలన్నీగుర్తు కు తెచ్చు కొన్నారు . .హనుమతో రాముడు ”హనుమా !నువ్వు సాక్షాత్తు బ్రహ్మవే .లేకపోతే చని పోయిన వాడిని మళ్ళీ బ్రతికించటం ఎవరి వల్ల సాధ్యం ?”అని మెచ్చుకొన్నాడు .

మాట నిలబెట్టు కోవటం హనుమకే సాధ్యం .దాని కోసం ఎవరినన ఒప్పించా గలడు మెప్పించ గలదు అవసరమైతే నొప్పించ గలడు .అదీ హనుమ పని తీరు .లోకోప కారి స్వామి భక్తి పరాయణుడు ,కార్య శూరుడు మన అంజనీ పుత్రుడు హనుమ .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat