అయ్యప్ప సర్వస్వం - 17

P Madhav Kumar


*గురు ఉపదేశార్హత*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


నేటికాల శబరిమలయాత్రీకులను యాత్రగావించే మహనీయులైన గురుస్వాములెందరో వున్నారు. వారిలో అనేకులు సద్గురువుల సేవచేసి వారివద్ద ఉపదేశము పొంది , సద్గుణ సదాచార సంపన్నులై వ్యవహరించి అటు స్వామి అయ్యప్పకు ఇటు అయ్యప్ప సమాజమునకు ఉన్నత సేవలు చేసి ఉత్తమ గురువర్యులై ప్రశోభిల్లు చున్నారు. మరికొందరు సద్గుణ సదాచార సంపన్నులై యున్నను ఏటేట శబరిమల భక్తులకు ఇరుముడి కట్టి యాత్ర గావించే వారైనను తగిన గురువువద్ద ఉపదేశము పొందుటకు అవకాశము లేక గురుస్వాములై పేరు ఘటించి యున్నారు. మరికొందరు మూడు సంవత్సరములు శబరిమలయాత్రచేసి తమకు తామే గురుస్వాములుగా ప్రకటించుకొని శబరిమలకు యాత్రీకులను తరలిస్తున్నారు.


నేటి గురుస్వాములందరు ఒకనాటి కన్నిస్వాములే. ఈనాటి కన్ని స్వాములలో ఎందరు గురుస్వాములన్నారో. కనుక గురుస్వాములైన వారు గురు ఉపదేశం పొందియున్న వారైనచో గురుశిష్యులు ఇరువర్గీయులు శ్రేయోదాయకం. కావున గురూపదేశం పొందుటకు కావలసిన అర్హతలేమిటో ప్రతివారు తెలిసిపెట్టు కొని యుండుట అత్యావశ్యక మగును అర్హత యున్నవారు తగిన గురువు చెంతచేరి గురుఉపదేశము పొందవలయునన్నది గూడ మిక్కిలి అత్యావశ్యకమగును.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat