*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 34*

P Madhav Kumar


*అధ్యాయము - 10*


*శుంభ వధ - 2*


విల్లు విజువబడడంతో దైత్యనాథుడు బల్లెం తీసుకున్నాడు. ఆ బల్లెం అతని చేతిలో ఉండగానే దానిని దేవి చక్రంతో ఛేదించింది.


అంతట ఆ రాక్షసరాజాధిరాజు ఖడ్గాన్ని, వంద చంద్ర బింబాలతో చిత్రించబడి మెరుస్తున్న డాలును, తీసుకొని దేవిపైకి ఉరికాడు.


అతడు అలా వేగంగా వస్తుండగానే చండిక ఆ ఖడ్గాన్ని, సూర్యకిరణాల వంటి ప్రకాశం గల అతని డాలును, తన వింటితో వాడి అమ్ములను ప్రయోగించి ఛేదించింది.


గుట్టాలు చంపబడి, ధనుస్సు విరవబడి, సారథి లేక, ఉండడంతో ఆ రక్కసుడు భయంకర ఇనుపగుదిని తీసుకుని అంబికను చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు.


ఆమె పైకి ఉరికి వస్తున్న అతని ఇనుపగుదిని వాడి అమ్ములతో విరుగొట్టింది. అప్పుడు, అతడు పిడికిటిని ఎత్తి ఆమె పైకి పరుగెత్తాడు.


దేవి హృదయంపై ఆ దైత్యశ్రేష్ఠుడు ఆ పిడికిటి పోటుతో కొట్టాడు. దేవి కూడా తన అరచేతితో అతని వక్షఃస్థలంపై కొట్టింది.


ఆ అరచేతిదెబ్బ తిని ఆ దైత్యరాజు భూమిపై పడిపోయాడు. కాని వెంటనే అతడు మళ్ళీ లేచాడు.


అతడు దేవిని పట్టుకొని ఎత్తుగా ఎగిరి ఆకాశ ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కూడా చండిక నిరాధార అయ్యి అతనితో పోరుసల్పింది.


అంతట ఆకాశంలో ఆ దైత్యుడు చండిక ఒకరితో ఒకరు అత్యపూర్వ విధంలో సిద్ధులకు, మునులకు ఆశ్చర్యం కలిగేలా (బాహు) యుద్ధం చేసారు.


మిక్కిలి దీర్ఘకాలం అతనితో (బాహు) యుద్ధం చేసిన పిదప అంబిక అతనిని ఎత్తి గిరగిరత్రిప్పి భూమిమీదికి విసిరివేసింది.


అట్లు విసరివేయగా, భూమిపై పడి, ఆ దుష్టాత్ముడు పిడికిటిని ఎత్తి చండికను చంపడానికి వేగంగా పరిగెత్తాడు.


సశేషం....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat